ETV Bharat / bharat

ఇంటివద్దనే సీబీఎస్​ఈ 10, 12 తరగతుల మూల్యాంకనం - Evaluation for class 10, 12 board exams

సీబీఎస్​ఈ 10, 12 తరగతుల పరీక్షా పత్రాలను ఉపాధ్యాయులు ఇంటివద్దనే మూల్యాంకనం చేస్తారని కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. ఉపాధ్యాయులకు పత్రాలు చేరవేసేందుకు 3 వేల పాఠశాలలను గుర్తించామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 50 రోజులు పడుతుందని స్పష్టం చేశారు.

LOCKDOWN-CBSE-EVALUATION
మూల్యాంకనం
author img

By

Published : May 9, 2020, 7:27 PM IST

లాక్​డౌన్​కు ముందు నిర్వహించిన సీబీఎస్​ఈ పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్. పరీక్షా పత్రాల మూల్యాంకనం ఉపాధ్యాయులు ఇంటివద్దనే చేస్తారని స్పష్టం చేశారు.

" 10, 12వ తరగతులకు సంబంధించి ఇప్పటికే నిర్వహించిన పరీక్షా పత్రాలు 3 వేల పాఠశాలల నుంచి ఉపాధ్యాయులకు చేరుతాయి. ఆదివారం నుంచి మూల్యాంకనం ప్రారంభిస్తారు. ఉపాధ్యాయులు తమ ఇంటివద్ద నుంచే పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి 50 రోజులు పడుతుంది."

- రమేశ్ పోఖ్రియాల్

కరోనా వైరస్​ను అరికట్టేందుకు దేశవ్యాప్త లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో పరీక్షా పత్రాల మూల్యాంకనంలో ఆలస్యం జరిగింది.

సీబీఎస్ఈ 10, 12 తరగతులకు సంబంధించి లాక్‌డౌన్‌కు ముందే కొన్ని పరీక్షలను నిర్వహించారు అధికారులు. మిగిలిన పరీక్షలు జరిగాల్సి ఉండగా వాటిని లాక్​డౌన్​ కారణంగా వాయిదా వేశారు. వీటిని జులై 1 నుంచి 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ఇటీవలే వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.