ఈటీవీ భారత్ కథనానికి అనూహ్య స్పందన లభించింది. ఆన్లైన్ క్లాసులు వినేందుకు ఓ విద్యార్థినికి స్మార్ట్ ఫోన్ అందేలా చేసింది.
నమక్కల్ జిల్లా కన్నూర్పట్టికి చెందిన తమిళరసి.. ముగ్గురు బిడ్డల తల్లి. రెండేళ్ల క్రితం భర్తను పోగొట్టుకుంది. అప్పటి నుంచి పిల్లల బాధ్యత తానే చూసుకోవాల్సి వచ్చింది.పెద్దకూతురు సౌందర్య(20) డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. రెండో కూమార్తె శుభసౌమ్య(15) ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరింది. కుమారుడు మణికంట(14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ముగ్గురూ ప్రభుత్వ బడుల్లోనే చదువుతూ మంచి మార్కులు సాధించేవారు. కానీ, కరోనా వేళ ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేకపోయారు.
![ETV Bharat Impact: Minister hands over smart phone to a poor student!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-nmk-02-etv-impact-minister-thangamani-help-to-poor-student-script-vis-7205944_04092020204222_0409f_03305_193_0509newsroom_1599315526_655.jpg)
తమిళరసి ఇంట్లో ఉన్నది ఒకే ఫోనూ. ఒకే ఫోన్లో, ఒకేసారి ముగ్గురు ఆన్లైన్ క్లాసులు వినడం కుదరలేదు. తరగతులకు హాజరుకాలేక వారు పడుతున్న గోసలను ఈ నెల 3న ఈటీవీ భారత్ ప్రసారం చేసిన కథనానికి తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి తంగమణి, నమక్కల్ జిల్లా కలెక్టర్ మేగ్రాజ్ స్పందించారు. రెండో కూతురు శుభసౌమ్యకు ఓ స్మార్ట్ ఫోన్ అందించారు.
![ETV Bharat Impact: tamilnadu power Minister thangamani hands over smart phone to a poor student!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-nmk-02-etv-impact-minister-thangamani-help-to-poor-student-script-vis-7205944_04092020204222_0409f_03305_1031_0509newsroom_1599315526_957.jpg)
![ETV Bharat Impact: Minister hands over smart phone to a poor student!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tn-nmk-02-etv-impact-minister-thangamani-help-to-poor-student-script-vis-7205944_04092020204223_0409f_03305_574_0509newsroom_1599315526_47.jpg)
"మేము ముగ్గురం అమ్మ సంపాదనపైనే ఆధారపడి బతుకున్నాం. పేదరికంలో ఫోన్ లేక ఇక్కట్లు పడ్డాం. కానీ, ఈటీవీ భారత్ వల్ల మా బాధలు మంత్రి వరకు చేరాయి. మాకు సాయం అందింది. ఈటీవీ భారత్కు హృదయపూర్వక కృతజ్ఞతలు."
-శుభసౌమ్య, విద్యార్థిని
ఇదీ చదవండి: నలుగురు గిరిజనులను చంపిన నక్సలైట్లు