ETV Bharat / bharat

'దేశ ఆకాంక్షలను నెరవేర్చేందుకే కొత్త విద్యావిధానం' - మోదీ వార్తలు

నూతన జాతీయ విద్యా విధానం-2020పై నిర్వహించిన గవర్నర్ల సదస్సులో పాల్గొన్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశ ఆకాంక్షలను నెరవేర్చేందుకే ఈ కొత్త విద్యావిధానాన్ని ప్రవేశపెట్టామని ప్రధాని మోదీ అన్నారు.

Education policy
నూతన జాతీయ విద్యా విధానం
author img

By

Published : Sep 7, 2020, 11:31 AM IST

కేంద్రం ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంపై సోమవారం గవర్నర్ల సదస్సు నిర్వహించింది కేంద్ర విద్యా శాఖ. 'ఉన్నత విద్య పరివర్తనలో జాతీయ విద్యావిధానం-2020 పాత్ర' పేరిట చేపట్టిన ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

విద్యావేత్తల సలహాలు, సూచనల మేరకే కొత్త విద్యావిధానాన్ని తీసుకొచ్చామని మోదీ తెలిపారు.

"ముందుగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు కృతజ్ఞతలు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ విద్యా విధానంలో సంస్కరణలు చాలా ముఖ్యం. ఎంతోమంది నిపుణుల సూచనలతో దీనికి ఆమోదం తెలిపాం. దేశ ఆకాంక్షాలను నెరవేర్చటంలో విద్యావిధానం పాత్ర కీలకం. విద్యా విధానం ప్రభుత్వాలతో ముడిపడి ఉంది. కానీ, ఇందులో ప్రభుత్వ జోక్యం తగ్గించటం కూడా అవసరమే. ఈ కొత్త విద్యా విధానం ద్వారా విద్యార్థులు చదవటం కన్నా నేర్చుకోవటంపై అధిక దృష్టి సారిస్తారు."

- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే ఎన్​ఈపీ-2020పై వెబినార్లు, వర్చువల్​ సమావేశాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇటీవలే కేంద్ర విద్యాశాఖ, యూజీసీ సంయుక్తంగా ఉన్నత విద్యలో సంస్కరణలపై సదస్సు నిర్వహించింది.

ఇదీ చూడండి: నూతన విద్యావిధాన ఆదర్శాలు అమలయ్యేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.