ETV Bharat / bharat

హెలికాఫ్టర్​లో గ్రామస్థుల చక్కర్లు

ఆకాశంలో వెళ్లే విమానాన్నో, హెలికాఫ్టర్​నో చూసినప్పుడు మనమెప్పుడు ఎక్కుతాం అని అనుకుంటూ ఉంటాం. మనలో కొందరు ఆ అనుభూతిని పొందుతారు. మరికొందరికి కల లానే మిగిలిపోతుంది. అలాంటి వారి కలను నిజం చేశాయి ప్రముఖ ఏవియేషన్​ సంస్థలు.

EDS Aviation and Deccan Charters organise helicopter rides for villagers
గ్రామస్థుల హెలికాఫ్టర్​ ప్రయాణం
author img

By

Published : Nov 2, 2020, 8:54 AM IST

హెలికాఫ్టర్​లో గ్రామస్థుల చక్కర్లు

కర్ణాటక కోలార్​ జిల్లాలోని శ్రీనివాసపురాకి చెందిన గ్రామస్థులను ఆకాశమార్గంలో కొంతసేపు తిప్పాయి ప్రముఖ ఏవియేషన్​ సంస్థలైన ఈడీఎస్​ ఏవియేషన్​ అకాడమీ, డెక్కన్​ ఛార్టర్​లు. శబ్దం రాగానే తల పైకెత్తి ఆకాశం వైపు చూసే వారిని కొత్తగా నింగిలోకి తీసుకుపోవడంతో వారి ఆనందం మిన్నంటింది.

పెద్ద పెద్ద వీవీఐపీలు మాత్రమే తిరిగే ఈ హెలికాప్టర్​లో సామాన్యులకు చోటు దక్కడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ 15 నిమిషాల జాయ్​ రైడ్​కు ఆ సంస్థలు కేవలం రూ.4,500 వసూలు చేయడం గమనార్హం. అయితే ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేముందు తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి: 1.25 కోట్ల రైలు టికెట్లు రద్దు.. కారణమిదే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.