అరుణాచల్‌ప్రదేశ్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రత నమోదైంది. అన్జు జిల్లాలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 3.36 గంటలకు వచ్చిన భూప్రకంపనలకు భయపడి ఆ ప్రాంతంలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఆగస్టు 6న రాష్ట్రంలోని తవాంగ్ ప్రాంతంలోనూ 3.0 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలోనూ...
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో ఆగస్టు 23న నాలుగు సార్లు భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. కానీ ఈ ఘటనలో ఎటువంటి నష్టం జరగలేదు.
"ఉదయం 11:39 గంటలకు 2.8 తీవ్రతతో మొదటి ప్రకంపన, సాయంత్రం 5:23 గంటలకు 3.0 తీవ్రతతో రెండోది సంభవించింది. కొంత సమయం తర్వాత 3.1 తీవ్రతతో సాయంత్రం 6:47 గంటలకు మరో భూకంపం, నాల్గోది మాత్రం రాత్రి 7:29 గంటలకు 2.7 తీవ్రతతో వచ్చింది." అని పాల్ఘర్ జిల్లా విపత్తు విభాగం అధికారి వివేకానంద్ కదమ్ తెలిపారు.