దేశంలో కరోనా వైరస్ మరింతగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 154 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రికార్డు స్థాయిలో 6,977 మంది వైరస్ బారిన పడ్డారు. ఒక్కరోజులో రికార్డైన కేసుల్లో ఇదే అత్యధికం. అయితే దేశంలో గత నాలుగు రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్... ఇరాన్ను వెనక్కినెట్టి ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు ఉన్న దేశాల జాబితాలో 10వ స్థానానికి చేరింది.
రాష్ట్రాల వారీగా..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం, కొత్తగా నమోదైన 154 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 58, దిల్లీ- 30, గుజరాత్- 29, మధ్యప్రదేశ్- 9, తమిళనాడు- 8, ఉత్తర్ప్రదేశ్- 6, తెలంగాణ- 4, రాజస్థాన్- 3, బంగాల్- 3, బిహార్- 2, పంజాబ్- 1, ఉత్తరాఖండ్- 1 చొప్పున సంభవించాయి.
ఇప్పటివరకు 41.57 శాతం మంది కరోనా అంటువ్యాధి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
ఇదీ చూడండి: నింగిలోకి విమానాలు- దేశీయ సర్వీసులు షురూ