దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు రెండోదశ లాక్డౌన్ కొనసాగుతోంది. కొంతమంది మాత్రం తమకేమీ పట్టనట్టు ఆంక్షలను ఉల్లఘించి రోడ్లపైకి వస్తున్నారు. అటువంటివారిని మహరాష్ట్ర పుణెలోని పోలీసులు వినూత్న పద్ధతిలో శిక్షించారు. స్వర్గేట్ పరిధిలో 200మందిని 4 గంటలపాటు రోడ్డుపై కూర్చోబెట్టారు.
"అనవసరంగా ఇంటి నుంచి బయటకు వస్తే ఇదే పరిస్థితి. అందుకే లాక్డౌన్ నిబంధనలు పాటించండి. మీ ఆరోగ్యాన్ని కరోనా నుంచి కాపాడుకోండి" అంటున్నారు పోలీసులు.
అత్యసవరమైతే తప్ప బయట అడుగుపెట్టవద్దని సూచిస్తున్నారు పోలీసులు.
ఇదీ చూడండి: కరోనా వేళ 'ఆయుష్' పెంచుకొనే మార్గాలివే..