ETV Bharat / bharat

ఆ సంస్థల కొవిడ్​ కిట్ల దిగుమతి లైసెన్సులు రద్దు

డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ).. మూడు సంస్థలకు ఇచ్చిన కరోనా టెస్టింగ్ కిట్ల దిగుమతి లైసెన్స్​లను రద్దు చేసింది. అలాగే మరో 16 సంస్థలకు ఇచ్చిన లైసెన్స్​లను నిలిపివేసింది. ఆయా టెస్ట్​ కిట్ల తయారీ సంస్థలను యూఎస్​ఎఫ్​డీఏ తన జాబితా నుంచి తొలగించడమే ఇందుకు కారణమని పేర్కొంది.

COVID-19: Import licenses for rapid diagnostic kits of 3 firms cancelled, 16 suspended by DCGI
ఆ సంస్థల కొవిడ్​ కిట్​ల దిగుమతి లైసెన్సులు రద్దు
author img

By

Published : Jul 25, 2020, 6:28 PM IST

భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)... మూడు సంస్థలకు చెందిన 'కరోనా టెస్టింగ్ కిట్ల దిగుమతి లెసెన్సు'లను రద్దు చేసింది. అలాగే మరో 16 సంస్థలకు చెందిన లైసెన్సులను నిలిపివేసింది.

అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్​ఎఫ్​డీఏ)... కరోనా సెరాలజీ టెస్ట్ కిట్స్​ తయారీదారులను... నిర్దేశిత జాబితా నుంచి తొలగించడమే ఇందుకు కారణమని డీసీజీఐ స్పష్టం చేసింది. అలాగే ఇప్పటికే దిగుమతి చేసిన ఈ కిట్లను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పంపిణీ చేయకూడదని ఆదేశించింది.

లైసెన్సులు రద్దు..

కాడిలా హెల్త్​కేర్​, ఎండీఏఏసీ ఇంటర్నేషనల్​, ఎన్​డబ్ల్యూ ఓవర్​సీస్​ కంపెనీలు దిగుమతి లైసెన్స్​లను రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి. అలాగే ట్రాన్సేసియా బయో మెడికల్స్, కాస్మిక్ సైంటిఫిక్, ఇన్బియోస్ ఇండియా, ఎస్​డీ బయోసెన్సార్, అక్యురెన్స్ బయోమెడికల్స్, బయోహౌస్ సొల్యూషన్స్, ట్రివిట్రాన్ హెల్త్​కేర్​ లాంటి 16 సంస్థల లైసెన్స్​లను సస్పెండ్ చేసింది.

"జులై 17న ఈ కంపెనీలకు షోకాజ్​ నోటీసులు జారీ చేశాం. కొవిడ్ సెరాలజీ టెస్ట్ కిట్​ల తయారీదారులను 'యూఎస్​ఎఫ్​డీఏ' తన జాబితా నుంచి తొలగించింది. అందుకే ఈ కంపెనీలకు ఇచ్చిన దిగుమతి లైసెన్స్​లు రద్దు చేస్తున్నట్లు తెలియజేశాం. అలాగే ఇప్పటికే దిగుమతి చేసుకున్న కిట్​లను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పంపిణీ చేయవద్దని ఆదేశించాం. దీనిపై జులై 20లోగా దీనిపై సమాధానం చెప్పాలని ఆ కంపెనీలకు ఆదేశించాం. వారు ఏమీ చెప్పని పక్షంలో.. డ్రగ్స్ అండ్ కాస్మటిక్స్ యాక్టు ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం."

- డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)

ఇదీ చూడండి: భారత్​లో ఒక్కరోజే 4.20 లక్షల కరోనా టెస్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.