ETV Bharat / bharat

ప్రజల సహనానికి 'కరోనా హెల్ప్​లైన్​' పరీక్ష - కరోనా వైరస్​ లక్షణాలు

దేశంలో కరోనా వైరస్​కు సంబంధించిన వివరాలను తెలుసుకోవటానికి ఏర్పాటు చేసిన హెల్ప్​లైన్ల నెంబర్లకు కాల్​ కనెక్ట్​ కావటం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉండగా... సమస్య పరిష్కారానికి ఆయా ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.

Coronavirus helplines either busy or unreachable, complain users
హెల్ప్​లైన్లు స్పందించటం లేదు... మా సమస్యను తెలపటం ఎలా?
author img

By

Published : Apr 2, 2020, 5:18 PM IST

కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తోన్న వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెల్ప్​లైన్​​​లు ఏర్పాటు చేశాయి. కానీ ఈ హెల్ప్​లైన్​ సెంటర్​కు ఫోన్​ చేసినప్పడు కాల్​ కనెక్ట్​ కాక అవస్థలు పడ్డుతున్నారు ప్రజలు.

తాజాగా దిల్లీకి చెందిన తివారీ అనే వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతూ పరీక్ష​ చేయించుకోవాలో? లేదో ? తెలుసుకోవటానికి హెల్ప్​లైన్​కు ఫోన్​ చేశాడు. కానీ కాల్​ కనెక్ట్​ కాక చివరకు స్థానిక వైద్యుడి వద్ద చికిత్స చేయించుకున్నట్లు తెలిపాడు.

"ప్రభుత్వం అందుబాటులో ఉంచిన హెల్ప్​లైన్ నెంబర్లు బిజీ వచ్చాయి. ఒక్కొక్క సారి కనెక్ట్​ కూడా కాలేదు. దాదాపు అర గంట సేపు వేచి చూశాను. కానీ అసలు కనెక్ట్​ కాలేదు. చివరకు నేను స్థానిక వైద్యుడి​ వద్దకు వెళ్లాను. కరోనా వైరస్​ సోకలేదని ఆయన ధైర్యం చెప్పారు."

-తివారీ, బాధితుడు

మరో ఘటన...

దిల్లీలో ఓ మీడియా సంస్థలో పని చేస్తున్న చింకి సిన్హాకు కూడా ఇదే తరహా అనుభవం ఎదురైంది. తన పక్క కాలనీలోని ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయని అధికారులకు తెలియజేయటానికి హెల్ప్​లైన్​కు ఫోన్​ చేయగా అరగంట సేపు బిజీ వచ్చింది.

"మా పక్క వీధిలోని కరోనా పాజిటివ్ కేసు గురించి, కొంత మంది వ్యక్తులు మాస్క్​లు లేకుండా తిరుగుతున్న విషయం గురించి అధికారులకు తెలియజేయాలని భావించాను. మా ప్రాంతాన్ని శానిటైజ్​ చేయాలని కోరాలనుకున్నాను. హెల్ప్​లైన్​కు ఫోన్​ చేసినప్పుడు అరగంట సేపు బిజీ వచ్చింది. చివరకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​కు మా సమస్య గురించి ట్వీట్​ చేశారు. కానీ ఇంత వరకు ఎలాంటి స్పందన రాలేదు."

-చింకి సిన్హా, జర్నలిస్టు.

దిల్లీ నుంచి మరో వ్యక్తి కూడా తనకు తెలిసిన రెండు కరోనా పాజిటివ్​ కేసుల గురించి అధికారులకు తెలపటానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్​లైన్లకు ఫోన్ చేయగా కాల్​ కలవలేదని తెలిపారు.

ఇతర రాష్ట్రాల్లోనూ...

ఇలాంటి ఘటనలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్​, హరియాణా రాష్ట్రాల్లోనూ జరిగాయి. హెల్ప్​లైన్​ కాల్స్​పై ఫిర్యాదులు పెరిగిపోతున్న నేపథ్యంలో సమస్య అధిగమించడంపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.