ETV Bharat / bharat

కరోనా: పట్టు రైతుల్లో ఆనందం- వాము సాగుదారుల్లో దిగులు!

చైనా ఎగుమతులు, దిగుమతులపై కరోనా వైరస్​ తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ కారణంగా చైనా నుంచి దిగుమతయ్యే సిల్క్ ఉత్పత్తులు దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో తమ పంటకి డిమాండ్ ఏర్పడిందని అనందం వ్యక్తం చేస్తున్నారు కర్ణాటక సిల్క్ రైతులు. అయితే వాము రైతులు మాత్రం తమ దిగుమతులు తగ్గిపోయాయని తలలు పట్టుకుంటున్నారు.

corona virus effect on india
కరోనా ఎఫెక్ట్: పట్టు రైతుల్లో ఆనందం- వాము సాగుదారుల్లో దిగులు!
author img

By

Published : Mar 1, 2020, 10:16 AM IST

Updated : Mar 3, 2020, 1:07 AM IST

కరోనా ఎఫెక్ట్: పట్టు రైతుల్లో ఆనందం- వాము సాగుదారుల్లో దిగులు!

కరోనా వైరస్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వైరస్​ కేంద్రబిందువు చైనా.. ఎగుమతి, దిగుమతులను గట్టిగానే దెబ్బతీస్తోంది. భారత్​ మార్కెట్​పైనా కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్​లో కొన్ని పంటలు పండించిన రైతులకు కరోనా వరం కాగా.. మరికొందరికి శాపంగా మారింది. చైనా నుంచి సిల్క్​ దిగుమతులు తగ్గి దేశీయ రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. వాము రైతులు మాత్రం ఆందోళనలో ఉన్నారు.

కర్ణాటక చిత్రదుర్గ లోని రామనగర సిల్క్ మార్కెట్​కు చైనా నుంచి దిగుమతులు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో సిల్క్​ రైతులకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇంతకు ముందు రూ. 325 నుంచి 375గా పలికిన సిల్క్​ ధర ప్రస్తుతం రూ. 575 నుంచి రూ. 625కు చేరింది. పెరిగిన ధరలతో చిత్రదుర్గ ప్రాంతంలోని కుమారధికెరె, ముద్దపుర, బీజీ కెరె, ఎండీ కోటె, మొలకల్​ముర్, చల్లకెరె రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కంటే ఎక్కువగా పట్టును ఉత్పత్తి చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

"14 ఏళ్ల నుంచి పట్టుపురుగులు సాగు చేస్తున్నాను. పట్టుకు రేటు ఎప్పుడూ ఇంత పలకలేదు. మొదట్లో కేజీకి రూ. 85 రూపాయలు ఉండేది. మూడు నెలల కిందట రూ. 3వందలకు పైగా ధర పెరిగింది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం రూ.650 వరకు పలుకుతోంది."

-హనుమంతప్ప, రైతు, కుమారాధికెరె

బిందు సేద్య పద్ధతిలో తక్కువ పెట్టుబడితో పట్టును సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు ఇక్కడి రైతులు. బిందు సేద్య పద్ధతిలో సాగు చేసి రైతులు లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారని చెబుతున్నారు. సెరికల్చర్ అధికారి బాలకృష్ణ.

"మొలకల్​ముర్ జిల్లాలోని ఆరు తాలుకాల్లో 180 హెక్టార్లలో పంట సాగయ్యేది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దిగుమతులు తగ్గిపోయి పంట విస్తీర్ణం పెరిగింది. ధర కూడా ఎక్కువ పలుకుతోంది."

-బాలకృష్ణ, డిప్యూటీ డైరెక్టర్, సెరికల్చర్ విభాగం, చిత్రదుర్గ

వాము రైతులది మరో కథ..

చైనాలో కరోనా వైరస్ ఉద్ధృతి కర్ణాటకలోని వాము రైతుల పాలిట శాపంగా పరిణమించింది. రాష్ట్రంలోని వాము రైతులకు ప్రధాన మార్కెట్ చైనా. బాగల్​కోటె జిల్లాలోని హుణగుండె తాలుకా వాము సాగుకు ప్రసిద్ధి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు మార్కెట్​ ద్వారా వాము పంటను చైనాకు ఎగుమతి చేస్తుంటారు ఇక్కడి రైతులు. టన్ను వాము పంటకు రూ. 30వేల ధర పలికేది. కరోనా ఎఫెక్ట్​తో ధరలు రూ. 5 వేలకు ధర పడిపోయింది. రాష్ట్రంలో అంతగా డిమాండ్​ లేని వామును కేవలం చైనాకు ఎగుమతి చేసేందుకే పండిస్తుంటారు రైతులు. ఈ నేపథ్యంలో బాగల్​కోటె, విజయపుర జిల్లాల్లోని హుణగుండె, ముద్దెబిహల్, బసవన్న బగేవాడీ ప్రాంతాల వాము రైతులను కరోనా తీవ్రంగా దెబ్బతీసింది.

ఇదీ చూడండి: దిల్లీ పాఠశాలలకు సెలవుల పొడిగింపు- పరీక్షలు వాయిదా

Last Updated : Mar 3, 2020, 1:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.