భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 23వేల మార్క్‌ను దాటింది. 24 గంటల్లోనే 1,684 కొత్త కేసులు నమోదయ్యాయి. 37 మంది ప్రాణాలు కోల్పోయారు.
వైరస్ బాధిత రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో 6,430మందికి కరోనా సోకింది. గుజరాత్లో 2,624మంది, దిల్లీలో 2,376మంది వైరస్ బారినపడ్డారు. మహారాష్ట్రలో 283మంది, గుజరాత్లో 112మంది, మధ్యప్రదేశ్‌లో 83, దిల్లీలో 50 మంది కరోనాతో అసువులు బాశారు.
అయితే లాక్డౌన్ కారణంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రకటించింది కేంద్రం. ఒకరోజులో 6 శాతం మాత్రమే కేసుల్లో పెరుగుదల నమోదైందని.. మార్చి 27 తర్వాత ఇదే అత్యల్ప వృద్ధి అని పేర్కొంది.
కేరళలో నాలుగు నెలల చిన్నారి మృతి..
కేరళ మలప్పురానికి చెందిన ఓ చిన్నారి కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయింది. కోజికోడ్ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మూడు నెలలుగా నిమోనియా, గుండె సంబంధిత సమస్యలతో చిన్నారి బాధపడుతుందని వైద్యులు వెల్లడించారు.
బిహార్‌లో మరో ఆరుగురికి..
బిహార్‌లో మరో ఆరుగురికి కరోనా సోకిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వైరస్ బాధితుల సంఖ్య అక్కడ 176కు చేరుకుంది. ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: కరోనాపై గొప్ప సందేశమిస్తోన్న 6 నెలల చిన్నారి!