మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఈనెల 12 నుంచి 'గాంధీ సందేశ్ యాత్ర'కు శ్రీకారం చుట్టనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ పాదయాత్రతో గాంధీ 150వ జయంతితో పాటు దండీమార్చ్ను కూడా స్మరించుకోనుంది. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు సాగిన దండీమార్చ్కు ఈనెల 12తో 90 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా అహ్మదాబాద్- సబర్మతీ ఆశ్రమం నుంచి దండీ వరకు (386 కిలోమీటర్లు) మొత్తం 27 రోజులపాటు ఈ పాదయాత్ర సాగనుంది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాలతో సహా పలువురు నేతలు ఈ యాత్రలో పాల్గొననున్నారు.
గాంధీ సందేశ్ యాత్ర ముగింపు సందర్భంగా దండీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. సోనియా, రాహుల్‌తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీడబ్ల్యూసీ సభ్యులు ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు.
గాంధీ స్ఫూర్తిని తిరిగి పొందడమే లక్ష్యం
దండీమార్చ్లో గాంధీ నింపిన స్ఫూర్తిని ఈ యాత్ర ద్వారా తిరిగి పొందడమే తమ ఉద్దేశమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఇదీ చదవండి: ఆఫీసులు, స్కూళ్లు, యూనివర్శిటీల్లో ఇక అవి బంద్!