ETV Bharat / bharat

ఉత్తరాఖండ్​ సీఎంపై సీబీఐ దర్యాప్తు - CBI probe

అవినీతి ఆరోపణలతో ఉత్తరాఖండ్​ సీఎం త్రివేంద్ర సింగ్​ రావత్​పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి ఆ రాష్ట్ర హైకోర్టు. దీంతో ముఖ్యమంత్రి పదవికి రావత్​ రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్​ డిమాండ్​ చేస్తోంది.

Cong demands U'khand CM's resignation over HC order of CBI probe; BJP to approach SC
ఉత్తరాఖండ్​ సీఎంపై సీబీఐ దర్యాప్తు
author img

By

Published : Oct 28, 2020, 7:45 PM IST

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్​ చేస్తోంది. ఓ కేసులో రావత్​పై అవినీతి ఆరోపణలతో సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్​ డిమాండ్ చేస్తోంది.

'రాష్ట్రంలో అవినీతిని నిరోధించడంలో ముఖ్యమంత్రి విఫమయ్యారు. ఇలాంటి ఉత్తర్వులు వచ్చిన తర్వాత సీఎం పదవిలో ఒక్క నిమిషం కూడా కొనసాగే అర్హతలేదు' అని కాంగ్రెస్ర రాష్ట్ర​ అధ్యక్షుడు ప్రీతమ్​ సింగ్​ ధ్వజమెత్తారు. రాష్ట్ర గవర్నర్​ బేబి రాణి మౌర్యను కలిసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతామని ప్రీతమ్​ సింగ్​ అన్నారు.

హైకోర్డు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా సీబీఐ దర్యాప్తు జరగాలంటే రావత్​ వెంటనే పదవి నుంచి వైదొలగాలని కాంగ్రెస్​ నేతలు కోరారు. మరోవైుపు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర భాజపా నేతలు తెలిపారు.

ఇదీ చూడండి: తేజస్వీ.. ఆటవిక రాజ్యానికి రాకుమారుడు: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.