ETV Bharat / bharat

'ఆర్థిక సాయం చేయకుంటే.. కరోనాపై విజయమెలా?'

కరోనా పోరులో రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే ప్రాణాంతక వైరస్​పై ఎలా విజయం సాధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్​ పాలిత ముఖ్యమంత్రులు. అందుకే వెంటనే ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో డిమాండ్​ చేశారు.

Cong CMs blame Centre for not giving any financial assistance to states
కరోనా పోరులో కేంద్రంపై మండిపడ్డ కాంగ్రెస్ సీఎంలు
author img

By

Published : Apr 23, 2020, 3:46 PM IST

కరోనా మహమ్మారిపై పోరులో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు. వైరస్​పై కట్టిడి చేసేందుకు రాష్ట్రాలకు కేంద్రం నిధులివ్వకపోతే మహమ్మారిపై దేశం ఎలా విజయం సాధిస్తుందని సీడబ్ల్యూసీ సమావేశం వేదికగా ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వాలకు దన్నుగా నిలిచేలా కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని పంజాబ్​, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్​ చేశారు.

"కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం.. అన్ని రాష్ట్రాలకు నిధులను విడుదల చేయాలి. కేంద్రం సరైన ఆర్థిక ప్యాకేజీ ఇవ్వకపోతే లాక్​డౌన్​ తర్వాత రాష్ట్రాలు సాధారణ పరిస్థితులకు ఎలా చేరుకుంటాయి. రాపిట్​ టెస్టు కిట్లు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తూ అవి విఫలమవుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం నాణ్యతతో కూడిన వెంటిలేటర్లు, కిట్లు ఎంతో అవసరం."

-అశోక్​ గహ్లోత్​, రాజస్థాన్​ ముఖ్యమంత్రి

"జీఎస్టీ ద్వారా వచ్చిన 4,400 కోట్లను కేంద్రం ఇప్పటికీ విడుదల చేయలేదు. రాష్ట్రానికి లక్ష టెస్టింగ్ కిట్లు అవసరం ఉంటే, కేవలం పదివేల చైనా కిట్లను మాత్రమే పంపారు. వాటి ప్రామాణికతను ఇంకా పరీక్షించలేదు"

-అమరీందర్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్శికులు, విద్యార్థులపై ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించారు ఛత్తీస్​గఢ్​​ ముఖ్యమంత్రి భూపేశ్​​ బఘేల్.

"ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు, విద్యార్థులు తిరిగి ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రత్యేకమైన విధానం అవసరం. కానీ ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది."

-భూపేశ్​ బఘేల్​, ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి.

"కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి సాయం చేయలేదు. ఇలా ఐతే సంక్షోభ సమయంలో రాష్ట్రం ఎలా మనుగడ సాధించగలదు. మేము శత్రువులం కాదు. ఈ సమయంలో ఐకమత్యంతో పోరాడి, విజయం సాధించాలి."

-వి.నారాయణ స్వామి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి

ఇప్పటి వరకు జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి వచ్చే రూ. 600 కోట్లు, ఆర్థిక కమిషన్​ ద్వారా వచ్చే 2,200 కోట్లు రూపాయలను కూడా ఇవ్వలేదని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.