ETV Bharat / bharat

అంగన్​వాడి.. సరికొత్త హంగులతో రెడీ - chikkaballapur anganwchikkaballapur anganvadi centersadi

కర్ణాటక చిక్కబళ్లాపుర్​ జిల్లా పరిషత్ సీఈఓ.. అంగన్​వాడి భవనాలకు కొత్త హంగులు దిద్దారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సకల వసతులు కల్పించారు. రంగురంగుల కళాకృతులతో అటు పిల్లలు, ఇటు తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్నారు.

CEO new plan to attract children to anganwadi centers  in karnataka chikkaballapur
అంగన్​వాడి.. కొత్త హంగులతో రెడీ!
author img

By

Published : Jul 20, 2020, 3:27 PM IST

ఉచితంగా పాలు, గుడ్లు ఇచ్చి పిల్లలకు అన్నం పెట్టడమే కాదు.. వారికి అక్షరాలు నేర్పి భవిష్యత్తుకు పునాదులు వేయడం కూడా అంగన్​వాడి కేంద్రాల బాధ్యతే. కానీ, తమ పిల్లలు రంగులతో హంగులు దిద్దిన ప్రైవేటు పాఠశాలల్లో చదివితేనే చదువొస్తుంది అనుకుంటారు చాలా మంది తల్లిదండ్రులు. అందుకే, రెండేళ్లు నిండగానే ఊర్లో ఉన్న అంగన్​వాడికి పంపకుండా.. అప్పు చేసి మరీ ప్రైవేటు స్కూళ్లలో చేర్చుతారు. ఈ పద్ధతికి స్వస్తి పలికించే ప్రయత్నం చేస్తున్నారు కర్ణాటక చిక్కబళ్లాపుర్​ జిల్లా అధికారులు.

CEO new plan to attract children to anganwadi centers  in karnataka chikkaballapur
అంగన్​వాడి.. కొత్త హంగులతో రెడీ!

చిక్కబళ్లాపుర్​ జిల్లా పరిషత్​ సీఈఓ పౌజి తరుణం.. ప్రైవేటు పాఠశాలలను తలదన్నే అంగన్​వాడి భవనాలను నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'న్రెగా' పథకం కింద రూ.5 లక్షలు, మహిళా శిశు అభివృద్ధి పథకం కింద రూ.3 లక్షలు మొత్తం రూ. 8 లక్షలతో జిల్లాలో కొత్త అంగన్​వాడి కేంద్రాలు ఏర్పాటు చేయిస్తున్నారు.

అంగన్​వాడి గోడలపై ఆంగ్ల, కన్నడ అక్షరాలు, అంకెలు, పక్షులు, జంతువుల పేర్లు.. ఆకట్టుకునే బొమ్మలు వేయించారు. అంతే కాదు, సకల వసతులు కల్పించి ప్రభుత్వ బడి రూపు రేఖలే మార్చేశారు. దీంతో గ్రామాల్లోని పిల్లలు, తల్లిదండ్రులు అంగన్​వాడి బడివైపు మొగ్గు చూపుతున్నారు.

ఇదీ చదవండి: కాషాయం రంగులో కళకళలాడుతున్న కాండం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.