దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం పెంపు దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలను ప్రకటించింది. వాటి ఛార్జింగ్‌కు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
కేంద్రం మార్గదర్శకాలు
- నగరాల్లో ప్రతి 3 కిలోమీటర్ల పరిధిలో కనీసం ఒక ఛార్జింగ్ స్టేషన్ అయినా ఉండాలి.
- జాతీయ రహదారులు, ప్రధాన రహదారులకు ఇరువైపులా ప్రతి 25 కిలోమీటర్లకూ ఒక స్టేషన్ ఏర్పాటు చేయాలి.
- పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లకు లైసెన్సులు అవసరం లేదు.
- ఇల్లు, కార్యాలయాల్లో ప్రైవేటు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు.
- ఇళ్లలో పెట్టుకొనే ఛార్జింగ్‌కు గృహావసరాలకు అనుగుణంగానే విద్యుత్తు ఛార్జీలు వసూలు చేస్తారు.
- పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో మాత్రం 2003 విద్యుత్ చట్టం మేరకు విద్యుత్ నియంత్రణ కమిషన్ నిర్ధరించే టారిఫ్ ప్రకారమే వసూలు చేస్తారు.
- విద్యుత్తు పంపిణీ సంస్థలు అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి.
మహా నగరాలన్నింటిలో..
వచ్చే మూడేళ్లలో 40 లక్షల జనాభా దాటిన అన్ని మహా నగరాలను కలిపే జాతీయ, కీలక రహదారులన్నింటిపైనా ఈ సదుపాయం కల్పించాలని కేంద్రం తెలిపింది. 3-5 ఏళ్లలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానుల్లో ఛార్జింగ్ నెట్వర్కులు ఏర్పాటు చేయాలని వెల్లడించింది.
ఇదీ చూడండి: హరియాణా పోరు: ఖట్టర్, హుడాల ప్రతిష్ఠకు సవాల్!