ETV Bharat / bharat

తోటి ఏనుగులతో పోరాడి గజరాజు మృతి! - ఛత్తీస్​గఢ్​లో మరో ఏనుగు మృతి

ఛత్తీస్​గఢ్ సూరజ్​పుర్​లో మరో ఏనుగు మృత్యువాతపడింది. ఇతర ఏనుగులతో పోరాటం చేయడం వల్లనే ఇది మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పోస్టుమార్టం తరువాత నిజానిజాలు వెల్లడవుతాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.

carcass of female elephant found in pratappur forest range of surajpur
ద్వంద్వ పోరాటంలో గజరాజు మృతి!
author img

By

Published : Jun 9, 2020, 12:33 PM IST

Updated : Jun 9, 2020, 12:38 PM IST

ఛత్తీస్​గఢ్​ సూరజ్​పుర్​లోని ప్రతాప్​పుర్ అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇతర ఏనుగులతో పోరాటం చేయడం వల్లనే ఈ గజరాజు మరణించినట్లు భావిస్తున్నారు.

తోటి ఏనుగులతో పోరాడి గజరాజు మృతి!

"కొద్ది రోజులుగా గణేశ్​పుర్ పరిసర ప్రాంతాల్లో ఓ ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఈ మందలో కనీసం 18 ఏనుగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ గుంపులోని మగవాటితో చేసిన పోరాటంలోనే ఈ ఏనుగు మరణించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. చుట్టూ ఉన్న చెట్లు కూడా విరిగిపడి ఉండడం దీనికి బలం చేకూరుస్తోంది. ఏది ఏమైనా పోస్టుమార్టం తరువాత ఏనుగు మృతికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయి."

- మనోజ్ విశ్వకర్మ, ప్రతాప్​పుర్ ఎస్​డీఓ

20 రోజుల క్రితం కంజ్వారీ ప్రాంతంలో ఇలానే ఓ ఏనుగు మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో ఉన్న ఓ తుపాకీని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: ఇరుకైన దారిలో: జాలువారే సెలయేరు.. జారితే బేజారు

Last Updated : Jun 9, 2020, 12:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.