ETV Bharat / bharat

భాజపా ఐకమత్యం.. ట్విట్టర్​లో మాస్కులతో దర్శనం - కరోనా వైరస్​ ఇండియా

కరోనాపై పోరులో భాగంగా ప్రధాని మోదీని భాజపా శ్రేణులు ఆచరిస్తున్నారు. మాస్కుల ఆవశ్యకతకు చిహ్నంగా మోదీ తాజా ప్రసంగంలో ఓ తువ్వాలును ధరించారు. ట్విట్టర్​ ప్రొఫైల్​ పిక్​గా అలాంటి చిత్రాన్నే పెట్టుకున్నారు. అనంతరం భాజపా అగ్రనేతలు కూడా తువ్వాళ్లు, మాస్కులు ధరించిన చిత్రాలను ట్విట్టర్​ ప్రొఫైల్​ ఫొటోగా పెట్టుకుంటున్నారు.

BJP leaders make photos of wearing face masks their Twitter profiles
భాజపా ఐకమత్యం.. ట్విట్టర్​లో మాస్కులు ధరించిన చిత్రాలు
author img

By

Published : Apr 14, 2020, 5:57 PM IST

దేశంలో కరోనాపై పోరులో భాజపా ఐకమత్యంతో ముందడుగు వేస్తోంది. జాగ్రత్త చర్యలు సూచించడమే కాకుండా.. పాటించి మరీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఇందులో ముందు వరుసలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉంటారు. అన్ని కార్యకలాపాల్లోనూ మాస్కును ధరించే పాల్గొంటున్నారు. ఈరోజు జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో ఓ తువ్వాలును ముఖానికి చుట్టుకున్నారు. ట్విట్టర్​ ప్రొఫైల్​ పిక్​గానూ అలాంటి చిత్రాన్నే పెట్టుకున్నారు.

తాజాగా భాజపా అగ్రనేతలు.. తువ్వాళ్లు, మాస్కులు ధరించిన తమ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తున్నారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్​ నేత- కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​, హర్ష వర్ధన్​, ఈశాన్య దిల్లీ ఎంపీ మనోజ్​ తివారీ, తమ చిత్రాలను ప్రొఫైల్​ ఫొటోలుగా పెట్టుకున్నారు. ఈ జాబితాలో మరికొందరు నేతలు కూడా ఉన్నారు.

ఇళ్ల నుంచి బయటకు వెళితే కచ్చితంగా మాస్కులు ధరించాలని సూచనలు చేస్తున్నారు.

ఇదీ చూడండి:- 'లాక్​డౌన్​ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.