ETV Bharat / bharat

'భారత్​ బయోటెక్​'కు కరోనా నివారణ బాధ్యతలు - antibodies for COVID-19 therapy

కరోనా నియంత్రణ కోసం యాంటీ బాడీస్​ను అభివృద్ధి చేసేందుకు భారత్​ బయోటెక్​కు అనుమతులిచ్చింది సీఎస్​ఐఆర్​. ఎన్​ఎంఐటీఎల్​ఐ ప్రోగ్రాంలో భాగంగా కొవిడ్​-19 నివారణకు ఉపయోగపడే మానవ మోనోక్లోనల్ యాంటీ బాడీస్ తయారీ భాద్యతను అప్పజెప్పింది. మరో 6 నెలల్లో ఈ యాంటీబాడీస్​ను అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు భారత్​ బయోటెక్​ ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా.

bharat-biotech-leads-a-csir-nmitli-supported-project-to-develop-human-antibodies-for-covid-19-therapy
'భారత్​ బయెటెక్​'కు కరోనా నివారణ బాధ్యతలు
author img

By

Published : May 8, 2020, 5:47 PM IST

లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటున్న కరోనా మహమ్మారికి​ వ్యాక్సిన్​ అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే అవన్నీ నెమ్మదిగా జరుగుతుండటం, ఎక్కువ ఖర్చుతో పాటు చివరికి వ్యాక్సిన్​ వస్తుందో లేదో అన్న అనుమానాల నడుమ.. ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించింది 'ది కౌన్సిల్ ఆఫ్​ సైంటిఫిక్​ అండ్​ ఇండస్ట్రియల్​ రీసెర్చ్​ (సీఎస్​ఐఆర్​)'. కొవిడ్​-19 నివారణకు 'మోనోక్లోనల్​ యాంటీబాడీ థెరపీ' ఎంతో ఉత్తమం, ఆరోగ్యకరమైనదని తాజాగా ప్రకటించింది. అందుకే ఈ యాంటీబాడీస్​ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్​ కేంద్రంగా పనిచేసే భారత్​ బయోటెక్​కు ఈ కీలక బాధ్యతను అప్పగించింది.

పుణెలోని నేషనల్​ సెంటర్​ ఫర్​ సెల్​ సైన్స్​ (ఎన్​సీసీఎస్​), ఐఐటీ-ఇండోర్​, గురుగ్రామ్​లోని ప్రెడ్​ఒమిక్స్​ టెక్నాలజీస్​ ఈ ప్రాజెక్టులో భాగం కానున్నాయి. న్యూ మిలీనియం ఇండియన్​ టెక్నాలజీ లీడర్​షిప్​ ఇనిషియేటివ్​ (ఎన్ఎంఐటీఎల్​ఐ) ప్రోగ్రాంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపింది ఐసీఎంఆర్​.

మోనోక్లోనల్​ యాంటీబాడీ థెరపీ.. కరోనాపై ప్రభావవంతంగా పనిచేస్తుందని అనుకుంటున్నట్లు వెల్లడించారు భారత్​ బయోటెక్ ఛైర్మన్​, ఎండీ డాక్టర్​ కృష్ణా ఎల్లా. మరో 6 నెలల్లో యాంటీబాడీస్​ను అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

"మానవ శరీరంలోని కరోనా వైరస్​ను ఈ మోనో క్లోనల్ యాంటీ బాడీస్ అత్యంత వేగంగా నియంత్రిస్తాయి. ఫలితంగా వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడం సులభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ వ్యాక్సిన్ కోసం ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ... వ్యాక్సిన్ కంటే మోనోక్లోనల్ యాంటీ బాడీస్ కరోనాను అడ్డుకోవడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి."

- డాక్టర్ కృష్ణా ఎల్లా, భారత్ బయోటెక్ ఛైర్మన్​, మేనేజింగ్ డైరెక్టర్​

అంటు వ్యాధుల వ్యాక్సిన్​ అభివృద్ధికి పేరుగాంచిన భారత్​ బయోటెక్ రాబిస్​తో పాటు​ ఇప్పటికే 10 రకాల వైరల్​ వ్యాక్సిన్​లను దిగ్విజయంగా కనిపెట్టింది.

హ్యూమన్​ సైటోమెగాలో వైరస్, హెర్పస్​ సింప్లెక్స్​ వైరస్​, హెచ్​ఐవీ-1, ఎబోలా వైరస్​, సార్స్​ వైరస్​తో పాటు ఇప్పటివరకు 60కిపైగా మోనోక్లోనల్​ యాంటీబాడీస్ అభివృద్ధి చేశారు. ఇందులో కొన్ని క్లినికల్​ ట్రయల్స్​లో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.