మానవాళిని కబళిస్తున్న కరోనా మహమ్మారిని తుదముట్టించేందుకు.. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషిచేస్తున్నారు. అయితే ఈ ప్రాణాంతక వైరస్‌కు నాశనం చేసేందుకు జరుగుతున్న పరిశోధనల్లో భారత్ ఒకంత ముందంజలో ఉంది.
ఆయుర్వేదంతో కొవిడ్-19ను అంతం చేయొచ్చా?
బెంగళూరుకు చెందిన అట్రిమెడ్ ఫార్మాసూటికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రుషికేశ్ దామ్లే... కరోనాను నియంత్రించే శక్తి ఆయుర్వేదానికి ఉందని చెబుతున్నారు. ఆయన స్వయంగా ఆయుర్వేద పద్ధతిలో ఓ ఔషధాన్ని తయారుచేశారు. ఇప్పటికే ఈ ఔషధం రెండు దశల పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) అనుమతి కోసం వేచి చూస్తున్నారు రుషికేశ్.
మూలికలతో.. పరమౌషధం
డాక్టర్ రుషికేశ్ దామ్లే ప్రకారం... "ఈ విశ్వంలో మూడు లక్షలకు పైగా ఔషధ మూలికలు ఉన్నాయి. ఒక్కో ముూలికకు ఒక్కో ఆరోగ్య సమస్యను నయం చేసే గుణముంటుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న కొన్ని మూలికలకు కరోనాను నియంత్రించే, నాశనం చేసే శక్తి ఉంది."
"కరోనా వైరస్‌లో ఉన్న స్పైక్ , మెమ్బ్రేన్, ఎస్టేరేస్ అనే మూడు ప్రోటీన్లను గుర్తించాం. తరువాత వీటిని తుదముట్టించే శక్తిగల 20 నుంచి 30 ఔషధ మొక్కలను గుర్తించాం. మానవశరీరంలో ఈ ప్రోటీన్ల వ్యాప్తిని నిరోధించే శక్తి ఈ మూలికలకు ఉంది. మేము కరోనా వైరస్‌పై పరిశోధనలు చేసేందుకు ఐసీఎంఆర్ అనుమతి అడిగాం. అనుమతులు లభిస్తే క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తాం."
- డాక్టర్ రుషికేశ్ దామ్లే
క్లినికల్ ట్రయల్స్‌కు రెడీ..
ఐసీఎంఆర్ అనుమతులు లభించిన వెంటనే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి రుషికేశ్ సిద్ధమవుతున్నారు. కొవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ తయారీలో ఇదో పెద్ద ముందడుగు అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ పొడిగింపుపై రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం: మోదీ