మధ్యప్రదేశ్ మంద్సౌర్ పశుపతినాథ్ ఆలయంలో అటోమేటిక్ సెన్సార్ గంటను ఏర్పాటు చేశారు నిర్వాహకులు.
సుదీర్ఘ లాక్డౌన్ తరువాత భక్తులకు తమ ఇష్టదైవాను దర్శించుకునే అవకాశం దక్కింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఆలయాలకు వెళ్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా... దేవుడి ముందు ఉండేది ఒకే గంట. మరి అందరూ అదే గంటను ముట్టుకుంటే వైరస్ సోకే ప్రమాదముంది కదా! అందుకే, ఇలా ముట్టుకోకుండా గంట కొట్టే ఏర్పాటు చేశారు.
పవిత్రమైన దేవాలయాల్లో వైరస్ వ్యాప్తిని తగ్గించే ప్రయత్నం చేశాడు నహ్రూ ఖాన్. అందుకే ఈ సెన్సార్ గంటను రూపొందించి అందరి మన్ననలూ పొందుతున్నాడు. ఈ సెన్సార్ బెల్ ముందు చేతిని చూపిస్తే చాలు గంట దానంతటదే మోగుతుంది.
"గుడిలో గంట కొట్టడం భక్తుల ఆనవాయితీ. కానీ, గంట కొట్టడం వల్ల ఈ కరోనా కాలంలో వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని దూరం చేసేందుకే ఈ బెల్ తయారు చేశాను."
-నహ్రూ ఖాన్
ఇదీ చదవండి:భార్యను వెలకట్టి స్నేహితులకు అమ్మేసిన భర్త!