ETV Bharat / bharat

ప్రపంచంలో పొడవైన రహదారి టన్నెల్ ప్రారంభానికి సిద్ధం - atal tunnal works completed

ప్రపంచంలోనే పొడవైన రహదారి టన్నెల్ ప్రారంభానికి సిద్ధమైంది. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ రహదారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆవిష్కరించనున్నారు. ఈ రహదారి టన్నెల్​లో ప్రతీ 60 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు.

Atal Tunnel
ప్రపంచంలో పొడవైన రహదారి టన్నెల్ ప్రారంభానికి సిద్ధం
author img

By

Published : Sep 16, 2020, 9:55 AM IST

సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే పొడవైన రహదారి టన్నెల్‌ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఈ టన్నెల్‌ను ప్రారంభించనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మనాలీ, లద్దాఖ్‌లో లేహ్‌ను అనుసంధానించే ఈ టన్నెల్‌.. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనదని అధికారులు తెలిపారు.

మొదట ఆరు సంవత్సరాల్లో పూర్తి చేద్దామని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. టన్నెల్‌ పూర్తి కావడానికి పదేళ్లు పట్టిందని అధికారులు వెల్లడించారు. టన్నెల్‌ లోపల ప్రతి 60 మీటర్లకు ఒక సీసీ కెమెరా ఉందని తెలిపారు. ప్రతి 500 మీటర్లకు అత్యవసర నిష్క్రమణ మార్గం(ఎమర్జెన్సీ ఎగ్జిట్) ఉంటుందని చెప్పారు. ఈ టన్నెల్‌ వల్ల మనాలీ, లేహ్‌ మధ్య దాదాపు 46 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని, తద్వారా 4 గంటల సమయం ఆదా అవుతుందని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.