ETV Bharat / bharat

అక్షరాస్యతలో కేరళ ప్రథమం​- ఆంధ్ర అధమం​ - NSO report

దేశంలో అక్షరాస్యతపై నివేదిక విడుదల చేసింది జాతీయ గణాంకాల సంస్థ (ఎన్​ఎస్ఓ). ఎప్పటిలాగే కేరళ ప్రథమ స్థానంలో ఉండగా... ఆంధ్రప్రదేశ్​ అధమ స్థానంలో ఉంది.

At 96.2%, Kerala tops literacy rate chart; Andhra Pradesh worst performer at 66.4%
అక్షరాస్యతలో కేరళ ప్రథమం​- ఆంధ్రప్రదేశ్ అధమం​
author img

By

Published : Sep 7, 2020, 5:38 PM IST

Updated : Sep 7, 2020, 6:26 PM IST

అక్షరాస్యతలో మళ్లీ కేరళ రాష్ట్రమే అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యధికంగా 96.2 శాతం అక్షరాస్యత నమోదు చేసింది. 66.4 శాతంతో ఆంధ్రప్రదేశ్​ అధమ స్థానంలో ఉంది. ఈ మేరకు జాతీయ గణాంకాల సంస్థ(ఎన్​ఎస్​ఓ) నివేదిక విడుదల చేసింది.

జాతీయ నమూనా సర్వే 75వ రౌండ్​లో భాగంగా జూలై 2017-జూన్​ 2018వరకు చేపట్టిన సర్వే వివరాలను 'భారతదేశంలో విద్య- సామాజిక గృహ వినియోగం' అనే పేరుతో నివేదికను విడుదల చేసింది ఎన్​ఎస్​ఓ. ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ వయసు గల వారిలో అక్షరాస్యతపై రాష్ట్రాల వారీగా ఈ సర్వే నిర్వహించింది.

దేశంలో ఇలా..

దేశ అక్షరాస్యత సగటు 77.7 శాతంగా ఉంది. గ్రామీణా ప్రాంతాల్లో 73.5 శాతం, పట్టణ ప్రాంతాల్లో 87.7 శాతంగా ఉంది. పురుషుల్లో 84.7శాతం, మహిళల్లో 70.3 శాతం అక్షరాస్యులున్నట్లు వెల్లడైంది. అన్ని రాష్ట్రాల్లోనూ మహిళల కంటే పురుషులే ఎక్కువ అక్షరాస్యత కలిగి ఉన్నారు.

కంప్యూటర్​ వినియోగం...

గ్రామీణా ప్రాంతాల్లో 4 శాతం, పట్టణ ప్రాంతంలో 23 శాతం కంప్యూటర్​ను వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 15-29 ఏళ్ల మధ్య వయసు వారు 24 శాతం, పట్టణాల్లో అయితే 56 శాతం మంది కంప్యూటర్ ఉపయోగిస్తున్నారు.

తొలి ఐదు రాష్ట్రాలు..

ఎన్​ఎస్​ఓ నివేదిక ప్రకారం... దిల్లీ, ఉత్తరాఖండ్​, హిమాచల్​ప్రదేశ్​,​ అసోం రాష్ట్రాలు కేరళ తర్వాత మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

చివరి నుంచి..

మధ్యప్రదేశ్, ఉత్తర్​ప్రదేశ్, తెలంగాణ, బిహార్, రాజస్థాన్​ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్​ కంటే​ ముందు వరుసలో ఉన్నాయి.

రాష్ట్రంఅక్షరాస్యత శాతం
కేరళ96.2
దిల్లీ88.7
ఉత్తరాఖండ్​87.6
హిమాచల్​ప్రదేశ్86.6
అసోం85.9
మధ్యప్రదేశ్​73.7
ఉత్తర్​ప్రదేశ్​73
తెలంగాణ72.8
బిహార్​70.9
రాజస్థాన్​69.7
ఆంధ్రప్రదేశ్​66.4

ఇదీ చూడండి: 'జీడీపీ పతనం ఆందోళనకరం- అప్రమత్తత అత్యవసరం'

Last Updated : Sep 7, 2020, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.