ETV Bharat / bharat

రెండు రోజుల మయన్మార్​ పర్యటనకు ఆర్మీ చీఫ్​ - Naravane

భారత సైన్యాధిపతి జనరల్​ ఎంఎం. నరవాణే ఆదివారం నుంచి 2 రోజుల పాటు మయన్మార్​లో పర్యటించనున్నారు. విదేశాంగ కార్యదర్శి హర్ష్​వర్ధన్​ ష్రింగ్లా కూడా ఆయనతో పాటు వెళ్లనున్నారు.

Army Chief to visit Myanmar on october 4th 2020
ఆర్మీ చీఫ్ మయన్మార్‌ పర్యటన రేపే
author img

By

Published : Oct 3, 2020, 6:37 PM IST

మయన్మార్‌తో సైనిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం. నరవాణే ఆదివారం ఆ పొరుగు దేశాన్ని సందర్శించనున్నారు. ఆయన రెండు రోజుల పర్యటనలో ఉగ్రవాద మూకలకు వ్యతిరేకంగా వ్యూహాలు రచించడం, ఇరు దేశాల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పనిచేయడం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష్​వర్ధన్​ ష్రింగ్లా కూడా ఆయన వెంట వెళ్లనున్నారు.

మార్చిలో కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత నరవాణేకు ఇదే తొలి విదేశీ పర్యటన. ఇందులో భాగంగా.. మయన్మార్ అగ్ర నాయకులు సహా ఆ దేశ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీలను భారత ఆర్మీ చీఫ్ కలిసే సూచనలున్నాయని సమాచారం.

ఇదీ చదవండి: రాహుల్​ హాథ్రస్​ పర్యటన అడ్డుకునేందుకు యోగి వ్యూహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.