1947లో రాజకీయ స్వాతంత్య్రం పొందిన భారతావని లైసెన్స్ పర్మిట్ రాజ్ శృంఖలాల్లో చిక్కి దాదాపు నాలుగున్నర దశాబ్దాలు ఛిద్రమైన దేశార్థిక వ్యవస్థకు.. ఆ సంకెళ్లు తెంచి సంస్కరణల నవశకానికి నాందీ వాచకం పలికింది పీవీ! అయిదేళ్లలోనే పీవీ దిద్దిన సంస్కరణల ఒరవడి, కేంద్రంలో ఎవరు అధికారానికి వచ్చినా మూడు దశాబ్దాలుగా శిరోధార్యం అవుతూనే ఉంది. ఆయన పదవీ రాజకీయాల రణజన్ముడు కాదు.. సంస్కరణల పథంలో దేశాన్ని కదం తొక్కించిన కారణజన్ముడు!
పూర్తి కథనం: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
తెలుగు జాతి అనర్ఘరత్నం పీవీ నరసింహారావు మొక్కవోని దీక్షాదక్షతకు పెట్టింది పేరు. ఆయన రాజకీయ దురంధరుడే కాదు గొప్ప పండితుడు కూడా. భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి, ఆర్థిక పునరుజ్జీవనం దిశగా పరుగులు తీయించిన ధీశాలి. ఈ మహా మనీషికి భారతరత్న పురస్కారం అందించి సత్కరించుకోవాల్సిన తరుణమిదే.
పూర్తి కథనం: తెలుగు జాతి అనర్ఘరత్నం పీవీ నరసింహారావు
'ఒక వ్యక్తి పుట్టుకతో కాదు, చేతల వల్ల గొప్పవాడవుతాడు' అని కౌటిల్యుడు అన్న మాటలు పీవీ నరసింహారావుకు అతికినట్లు సరిపోతాయి. ఎందుకంటే ప్రధానిగా ఆయన చేసిన కృషి నిరుపమానం. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈనాడు భారత్‌ను ఆర్థికంగా నిలబడేలా చేశాయి.
పూర్తి కథనం: ఆర్థికం తెలియకున్నా.. అందులోనూ తనదైన ముద్ర
పీవీ నరహింహారావు.. బహుముఖ ప్రజ్ఞశాలిగా, రాజనీతిజ్ఞుడిగా సుపరిచితమే. కానీ, ఆయనలో చాలా మందికి తెలియని ఇంకో కోణం ఉంది. ఆధ్యాత్మిక మార్గంలోనూ ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఓ దశలో పీఠాధిపతి అయ్యేందుకు సిద్ధమయ్యారు కూడా. 1991లో జరిగిన అనూహ్య పరిణామాలతో ప్రధాని పీఠాన్ని అధిరోహించారు.
పూర్తి కథనం: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠాన్ని అధిరోహించి
'వచ్చే ఎన్నికల గురించి ఆలోచన చేసేవాడు నాయకుడు. వస్తున్న తరాల భవిష్యత్తును నిర్దేశించే వ్యక్తిని రాజనీతిజ్ఞుడు' అని అంటారు. నరసింహారావు రెండో కోవకు చెందినవారు. నిజానికి ఆయన వ్యక్తి నుంచి ప్రభావిత శక్తిగా, వ్యవస్థగా ఎదిగిన దార్శనికుడు. ఆర్థిక సంస్కరణల పథ నిర్దేశకుడు, నవభారత నిర్మాత పీవీ.
పూర్తి కథనం: పీవీకి 'వంద'నం: సంస్కరణల సారథి.. అభివృద్ధికి వారధి
బహుముఖ ప్రజ్ఞాశాలి... ఎన్నో భాషల్లో నిష్ణాతుడు... రాజకీయ సోపానంలో ముఖ్యమంత్రిగా... కేంద్రమంత్రిగా... ప్రధానమంత్రిగా... ఏ పదవి చేపట్టినా... ఆయనది మునీశ్వర తత్వమే. కర్మయోగిలా తన పని చేసుకుంటూ వెళ్లడమే ఆయన నైజం. భారత రాజకీయ యవనికపై తనదైన ముద్రవేసి, ప్రగతి ఫలాల కోసం చెట్లు నాటి మనకు అందించిన దార్శనికుడు.
పూర్తి కథనం: పీవీ ప్రత్యేకం: తెలుగు కీర్తి.. పాములపర్తి
1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. నేడు పీవీ శతజయంతి సందర్భంగా ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని, అనుభవాలను 'ఈనాడు, ఈటీవీ భారత్' కోసం రాసిన ప్రత్యేక వ్యాసంలో పంచుకున్నారు సింగ్. 'స్వలాభం కోసం పాకులాడకుండా, ఫలాపేక్ష లేకుండా విధులు నిర్వహించిన నిజమైన కర్మసన్యాస యోగి' అని పేర్కొన్నారు.
పూర్తి కథనం: 'పీవీ.. భరతమాతకు గర్వకారణమైన పుత్రరత్నం'
చరిత్రలో కొన్ని రోజులు ఒక వెలుగు వెలిగి ఆరిపోయేవాళ్లు కొందరు! జీవించి ఉన్నా, లేకున్నా శాశ్వతంగా చరిత్రలో నిలిచి తరతరాలకు తమ వైభవదీప్తులు వెదజల్లే వారు, మార్గ నిర్దేశం చేసేవారు ఇంకొందరు. రెండవ కోవలోనే ప్రముఖంగా కనిపిస్తారు.. తెలుగుఠీవీ.. మాజీ ప్రధాని దివంగత పీవీ.
పూర్తి కథనం: భారత యవనికపై చెరిగిపోని సంతకం 'పీవీ'
ఇప్పుడు ఎన్నో అంకురసంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రైవేట్ ఈక్విటీ, సూక్ష్మరుణాలు, కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తంగా జీవనశైలి మారింది. ఇది ఒక్కరాత్రిలో జరిగింది కాదు. ఇదంతా సాధ్యం చేసింది.. కొత్త శకానికి నాంది పలికింది పీవీ.
పూర్తి కథనం: భవిష్యత్ తరాల మార్గదర్శి- సంస్కరణల రుషి 'పీవీ'
రాజకీయాల్లోనే కాదు.. సాహితీ రంగంలోనూ ప్రత్యేకత చాటుకున్నారు పీవీ. సమకాలీన సాహిత్యం చదువుతూనే నవలలు, కథలు రాశారు. మొదట్లో పద్య ప్రక్రియపై ఆసక్తి చూపిన ఆయన క్రమంగా ఆధునిక కవిత్వం వైపు మళ్లారు. అనువాదంపై ఉన్న అభిలాషతో పలు రచనలు తెలుగులోకి తీసుకొచ్చారు. అవే సాహితీ రంగంలో ఆయనకు ఎనలేని పేరు, ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి.
పూర్తి కథనం: రాజకీయం- సాహిత్యం రెండు కళ్లలా 'పీవీ' జీవనం
నొప్పింపక..తానొవ్వక.. అన్న చందంగా సాగింది మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు దౌత్యనీతి. ఎదుటి వాళ్లకు సమస్య రాకూడదు, మన సమస్య అలాగే ఉండిపోకూడదు..! ప్రధానిగా ఐదేళ్ల పాలనలో ఆయన ఆలోచనా విధానం ఇలాగే సాగింది. అందుకే అప్పటి వరకు ఉన్న దౌత్య విధానానికి స్వస్తి పలికి సరికొత్త పంథాలో ముందుకు సాగారు పీవీ. ఇజ్రాయెల్‌తో సంబంధాలు మెరుగైనా...అమెరికాతో చెలిమి కొత్త పుంతలు తొక్కినా.. దాయాదులపై దాడి చేయకుండా దారికి తెచ్చినా.. అది ఆయన చలవే.
పూర్తి కథనం: 'పీవీ' రూటే వేరు.. సరికొత్త పంథాలో దౌత్యనీతి
పదవులు రావడం గొప్పకాదు. ఆ పదవీకాలంలో పదికాలాల పాటు గుర్తుండిపోయేలా పాలించడం గొప్ప. ప్రధానిగా పీవీ నర్సింహారావు అదే చేశారు. ఆయన పదవి చేపట్టే నాటికి ముగినిపోయే నావలా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన మార్క్ పాలనను అందించారు.
పూర్తి కథనం: ప్రధాని పదవికే వన్నె తెచ్చిన 'పీవీ'
జాతీయోద్యమంలో ఎగిసిపడిన కెరటం. హైదరాబాద్ విముక్త పోరాటంలో ఆయనో పొలికేక. ఆధునిక భారత నిర్మాణానికి ఆద్యులు. గ్రూపు రాజకీయాలకు నిలయమైన కాంగ్రెస్‌లో ఆయనే ఒక సైన్యం. మారుమూల పల్లె నుంచి ప్రధానిగా ఆయన ఎదిగిన తీరు అనిర్వచనీయం.
పూర్తి కథనం: వందేమాతరమే 'పీవీ' రాజకీయ జీవితానికి ప్రారంభ గీతిక
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో పీవీ నరసింహారావు పాత్రను ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు ఆయన రాజకీయాల్లోకి రావడానికి ప్రేరేపించిన అంశాలేంటి? ప్రజా జీవితంలోకి ఎప్పుడు అడుగు పెట్టారు. ఆయన పొలిటికల్ ప్రొఫైల్ మీకోసం..
పూర్తి కథనం: వంగర- దిల్లీ: 'పీవీ' రాజకీయ ప్రస్థానం ఘనం