ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా నిరాడంబరంగా నవరాత్రి వేడుకలు

విజయదశమి పర్వదినాన్ని.. దేశమంతా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటోంది. నవరాత్రుల వేడుకలతో ఇప్పటికే దేశమంతా పండగ శోభతో అలరారుతూ ఉండగా.. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమైన విజయదశమిని భక్తిప్రపత్తులతో జరుపుకుంటున్నారు. కొవిడ్ నేపథ్యంలో.. రావణ దహనాలు వంటి కార్యక్రమాలు లేకుండానే.. నిరాడంబరంగా పండుగను జరుపుకుంటున్నారు.

amid-covid-19-restrictions-india-celebrates-dusshera-with-fervor-today
దేశవ్యాప్తంగా నిరాడంబరంగా దసరా వేడుకలు
author img

By

Published : Oct 25, 2020, 9:00 AM IST

నవరాత్రి ఉత్సవాల్లో ఆఖరిరోజైన విజయదశమిని.. దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. కొవిడ్ నేపథ్యంలో.. రావణ దహనాలు వంటి కార్యక్రమాలు లేకుండానే నిరాడంబరంగా పండుగను జరుపుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా ఇలా..

అసోంలోని ధుబ్రిలో ఔషధాలను ఉపయోగించి సంజీబ్ బసక్ అనే ఓ ఔత్సాహికుడు దుర్గాదేవి ప్రతిమను రూపొందించారు. గడువు ముగిసిన మాత్రలను, ఔషధాలను ఉపయోగించి ఆరడుగుల అమ్మవారి విగ్రహాన్ని తయారుచేశారు. విగ్రహం తయారీకి 5 నెలల సమయం పట్టిందన్న సంజీబ్.. 40వేల వరకూ మాత్రలు, ఇంజెక్షన్ వయల్స్‌, క్యాప్సుల్స్‌ ఉపయోగించినట్లు తెలిపారు.

amid-covid-19-restrictions-india-celebrates-dusshera-with-fervor-today
ఔషధాలతో దుర్గాదేవి ప్రతిమ
  • ఒడిశాలోని గంజాంలో ఓ ఔత్సాహికుడు అతి సూక్ష్మ పరిమాణంలో దుర్గాదేవి ప్రతిమను తయారుచేసి రికార్డు సృష్టించాడు.
  • విజయదశమిని పురస్కరించుకుని పలుచోట్ల ఏర్పాటుచేసిన బొమ్మల కొలువులు సైతం ఆకట్టుకుంటున్నాయి.
  • గువాహటిలోని కామాఖ్య ఆలయాన్ని.. దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. గోరఖ్​పూర్ మఠంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. పీఠాధిపతి హోదాలో దుర్గా పూజ నిర్వహించారు.

    దిల్లీలోని ఓ ఆలయంలో..

ఇదీ చూడండి:- సకల సృష్టికి మూలం విజయ విలాసిని!

నిరాడంబరంగా..

కరోనా నేపథ్యంలో.. ఈసారి విజయదశమి వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. దిల్లీ రాంలీలా మైదానంలో ఏటా రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో రావణ దహనం జరుగుతూ వస్తుండగా.. ఈసారి మాత్రం నిర్వాహకులకు పురావస్తు శాఖ అనుమతి ఇవ్వలేదు.

మైసూరులో.. దసరా ఉత్సవాలు సాధారణంగా జరుగుతున్నాయి. రాజవంశస్థుల ఆధ్వర్యంలో వందల ఏళ్లుగా నిర్వహిస్తున్న జంబూసవారీని నిరాడంబరంగా జరపాలని

భావిస్తున్నారు. కేవలం 300 మందికే ఆహ్వానం పంపగా.. 30 నుంచి 40 నిమిషాల్లో కార్యక్రమాన్ని పూర్తిచేయనున్నారు.

ఇదీ చూడండి:- దసరా వేడుకల్లో తృణమూల్​ ఎంపీ- నృత్యంతో సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.