ETV Bharat / bharat

ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండేళ్ల బాలుడు పిటిషన్​ - లక్షణాలు లేని వైరస్​ బాధితులకు పరీక్షలు

దిల్లీలోని ఓ రెండేళ్ల బాలుడు హైకోర్టును ఆశ్రయించాడు. లక్షణాలు లేని వైరస్​ బాధితులకు పరీక్షలు నిర్వహించకూడదన్న ప్రభుత్వ నిర్ణయంతో తన ప్రాణాలకు ప్రమాదం ఉందని పిటిషన్​ వేశాడు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం విచారించనుంది హైకోర్టు.

'Am at risk': Toddler moves Delhi HC against asymptomatic testing ban
ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండేళ్ల బాలుడు పిటిషన్​
author img

By

Published : Jun 10, 2020, 11:17 AM IST

దిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాడు ఓ రెండేళ్ల బాలుడు. లక్షణాలు లేని కరోనా వైరస్​ బాధితులకు​ పరీక్షలు నిర్వహించకూడదన్న ప్రభుత్వ నిర్ణయంతో తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని పిటిషన్​లో పేర్కొన్నాడు.

"పిటిషనర్​.. ఓ ఉమ్మడి కుటుంబానికి చెందిన మైనర్​. కుటుంబంలో చాలా మంది పని చేస్తున్నారు. దిల్లీ ప్రభుత్వం ప్రకటించిన 'అన్​లాక్​డౌన్'​తో ఉద్యోగాల కోసం ఆఫీసులకు వెళుతున్నారు. కుటుంబసభ్యులతో జీవిస్తున్న ఇతర మైనర్లలాగే.. ఈ రెండేళ్ల బాలుడికి కూడా వైరస్​ సోకే ప్రమాదం పొంచి ఉంది. ఆంక్షలు ఎత్తివేయడం సహా లక్షణాలు లేని వారికి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పరిస్థితులు దారుణంగా మారాయి. ఆరోగ్య వసతులు, వెంటిలేటర్లు, ఆసుపత్రుల్లో పడకలు కూడా తక్కువగా ఉన్నాయి."

-- పిటిషనర్​ తండ్రి.

మైనర్​ తరఫున ఈ వ్యాజ్యాన్ని న్యాయవాదులు అర్జున్​ స్యాల్​, విదిషా గుప్తా దాఖలు చేశారు. దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీ.ఎన్​ పటేల్​, జస్టిస్​ ప్రతీక్​ జలాన్​తో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని నేడు విచారించనుంది.

ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేయడం, లక్షణాలు లేని బాధితులకు పరీక్షలు నిర్వహించకపోవడం.. ఈ రెండు చర్యలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని పిటిషన్​లో మైనర్​ పేర్కొన్నాడు.

ఇదీ చూడండి:- గుంత తవ్వి.. 200 పందులను సజీవంగా పూడ్చి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.