ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత విమానాశ్రయాల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం జారీ చేసింది. ప్రారంభంలో టైర్-1 నగరాలుగా పరిగణించే మెట్రోలు, రాష్ట్ర రాజధానుల్లో ఉండే విమనాశ్రయాలతోపాటు కొన్ని ముఖ్యమైన టైర్-2 విమానాశ్రయాల నుంచే విమాన సర్వీసులు ఉంటాయి.
అలాగే విమానాశ్రయంలో ఎక్కువ టెర్మినల్స్ ఉంటే మొదట ఒక్క టెర్మినల్‌నే వినియోగించుకునేందుకు అనుమతిస్తారు. సామాజిక దూరాన్ని పాటించేందుకు అనువుగా బ్యాగేజీ తీసుకునే కరౌసెల్స్‌ను కూడా ఒకటి విడిచి ఒకటి వినియోగించుకోవాల్సి ఉంటుంది.పరిమిత సంఖ్యలోనే ఆహార ఔట్‌లెట్లను తెరిచేందుకు అనుమతిస్తారు.