"కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ, ఓ వైపు అమ్మగా బాధ్యత తీసుకోవాలి, డ్యూటీ కూడా చేయాలి. మా వాళ్లంతా 24 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఒక రోజు వాళ్ల దగ్గర బాబును ఉంచాను. ఆ రోజంతా తను బాగా ఏడ్చాడు. ఏడాది వయసున్న నా కుమారుడికి ఒంట్లో బాలేదు. బయట తిండి తినలేడు, నా చనుబాలతోనే తన ఆకలి తీర్చుకుంటాడు. అందుకే నేను నా బాబును వెంటబెట్టుకునే ఉద్యోగం చేస్తున్నాను. " అంటూ.. అటు అమ్మగా, ఇటు కానిస్టేబుల్‌గా ఒకేసారి బాధ్యతలు నిర్వర్తిస్తోంది సంగీత బెనర్జీ.
గుజరాత్ బరోడాలోని కోర్వా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్న సంగీత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలో అహ్మదాబాద్‌లో బందోబస్తు విధులకు హాజరైంది.
ఓ చెట్టుకు చీరతో ఊయల కట్టి.. అందులో తనయున్ని పడుకోబెట్టి.. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఈ 'పోలీస్ అమ్మ'ను చూసి అందరి హృదయాలను చెలించాయి. దగ్గు, జలుబుతో బాధపడుతున్న తన కుమారుడిని ఒంటరిగా ఇంట్లో వదిలిరాలేక.. ఇటు వృత్తి బాధ్యతను విస్మరించలేక ఈ ఉపాయం చేసింది సంగీత.
ఇదీ చదవండి:దిల్లీ బడిలో మెలానియాకు 'సంతోషాల పాఠాలు'