ETV Bharat / bharat

భారత్ భూభాగం​లోకి చొచ్చుకొచ్చిన చైనా చాపర్లు!

భారత్​ చైనా సరిహద్దులో చైనా​ సైన్యానికి చెందిన హెలికాప్టర్ చక్కర్లు కొట్టాయి. హిమాచల్​ ప్రదేశ్​లోని లాహౌత్​ స్పితి వద్ద సరిహద్దును దాటి ఏకంగా భారత భూభాగంలో 12 కి.మీ మేర చొచ్చుకొచ్చినట్టు స్థానిక పోలీసులు గుర్తించారు. వెంటనే ఐటీబీపీకి సమాచరమిచ్చారు. విషయం తెలుసుకున్న భారత సైన్యం విచారణ చేపట్టింది.

A Chinese helicopter was seen in Lahaul Spiti, about 12 km inside the international border.
భారత గగనతలంలో.. చైనా యుద్ధ హెలికాప్టర్​ చక్కర్లు!
author img

By

Published : May 17, 2020, 11:33 AM IST

Updated : May 17, 2020, 3:00 PM IST

చైనా సరిహద్దు వెంబడి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇటీవలే వాస్తవాధీన రేఖ వెంబడి చైనా హెలికాప్టర్లు చెక్కర్లు కొట్టగా.. తాజాగా చాపర్లు అంతర్జాతీయ సరిహద్దును దాటి ఏకంగా భారత భూభాగంలోకి 12కిలో మీటర్ల మేర చొచ్చుకొచ్చాయి. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్​లోని లాహౌత్​ స్పితి వద్ద ఆదివారం జరిగింది.

అప్రమత్తమైన స్థానిక పోలీసులు.. సైనిక నిఘా వ్యవస్థ, ఐటీబీపీకు సమాచారం అందించాయి. చాపర్లు తక్కువ ఎత్తులో ప్రయాణించినట్టు స్థానిక పోలీసులు వివరించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టింది భారత సైన్యం.

లాహౌత్​ స్పితి వద్ద చైనా హెలికాప్టర్లు చొరబడటం ఒకటిన్నర నెలల్లో ఇది రెండోసారి అని అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:వధూవరులకు వెండి 'మాస్క్'​ ఆభరణం!

Last Updated : May 17, 2020, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.