ETV Bharat / bharat

ఆ సైకిల్​పై 4 తరాల నాన్​స్టాప్​ సవారీ

author img

By

Published : Jun 22, 2020, 3:20 PM IST

లక్షలు పోసి కొనే ఎన్నో కార్లు నాలుగైదేళ్లకే మూలనపడుతున్నాయి. పది పదిహేనేళ్లు దాటితే.. పాత ఇనుప సామాన్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. కానీ, 70 ఏళ్ల క్రితం నాటి ఓ సైకిల్​ మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కేరళకు చెందిన ఓ కుటుంబంలో నాలుగో తరాన్ని మోస్తున్న ఆ సైకిల్​ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి...

A bicycle that's lasted 70 years and four generations of a Kerala family
ఆ సైకిల్​.. నాలుగు తరాలను మోసింది!

ఇప్పుడంటే ఇంటిముందు ఓ బెంజ్​ కారున్నా పెద్దగా పట్టించుకోరు. కానీ, ఓ అర్ధ శతాబ్దం వెనక్కి వెళ్తే.. ఎవరింటి ముందైనా ఓ సైకిల్​ కనిపిస్తే చాలు కళ్లప్పగించి అలాగే చూసేవారు. అవును మరి, అప్పట్లో సైకిళ్లే వారికి లగ్జరీ ప్రయాణ సాధనాలు. ఆ కాలం నాటి ఓ సైకిల్.. 70 ఏళ్లుగా ఏ లోటు లేకుండా మన్నుతోంది. కేరళకు చెందిన మార్షల్​ కుటుంబానికి బహుమతిగా వచ్చి వంశపారంపర్య ఆస్తిగా మారింది.

బహుమతిగా వచ్చింది...

A bicycle that's lasted 70 years and four generations of a Kerala family
ఓ బాలుడితో .. మార్షల్​ పెరీరా 1950లో..

1950లో ఇడుక్కి జిల్లా మున్నూర్​లోని ఓ టీ కంపెననీలో​ ఉద్యోగం చేసేవాడు మార్షల్ ఎ పెరీరా. అదే సమయంలో మార్షల్​కు పరిచయమైన ఓ వ్యాపారి.. ఇంగ్లాండ్​ కార్ల్​టన్​ ఫ్యాక్టరీలో తయారైన సన్​ బ్రాండ్​ సైకిల్​ను బహుమతిగా ఇచ్చాడు. అప్పట్లో మార్షల్​తో పాటు కుమారులు అలెగ్జాండర్​ షార్ట్​పూల్, సిరిల్ పెరీరా, కుమార్తె షిర్లీ పాల్​ కూడా​ ఈ సైకిల్​ను నడిపేవారు.

షిర్లీ 2020లో.. 1953లో

1981లో మార్షల్​ కుటుంబం తిరువనంతపురానికి మారింది. వారితోపాటే సన్​ సైకిల్​ కూడా వచ్చేసింది. అక్కడ షిర్లీ కుమారులు జార్జ్​, జాన్​ ఈ సైకిల్​పైనే స్కూలుకు వెళ్లేవారు. ఆ తర్వాత ఈ సైకిలే వారిని కాలేజీకి తీసుకెళ్లింది. అలా వంశపారంపర్యంగా చేతులు మారుతూ వచ్చింది​. ఇప్పుడు మార్షల్​ మునిమనవళ్లూ ఈ సైకిల్​పై సవారీ చేస్తున్నారు.

చెక్కు చెదరలేదు...

మార్షల్​ తనయుడు సిరిల్​... షిర్లీ తనయుడు జాన్​

నాలుగో తరాన్ని మోస్తున్న ఈ సైకిల్ ఇప్పటి వరకు ఆగింది లేదు. ఓసారి ఈ సైకిల్​ హెడ్​లైట్​ను ​ ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత చిన్న చిన్న పంక్చర్ల వల్ల పలుమార్లు చక్రాలు మార్చారు. అంతే, మిగిలిందంతా సేమ్​ టు సేమ్ 70 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది.

నాలుగో తరంతో...

ఇదీ చదవండి:జాగ్తే రహో: ఛార్జింగ్​ పెడితే బ్యాంక్​ ఖాతా ఖాళీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.