ETV Bharat / bharat

'శ్రామిక్​ రైళ్లల్లో 97మంది కూలీలు మృతి' - Shramik special trains news on Parliament

కరోనా కారణంగా విధించిన దేశవ్యాప్త లాక్​డౌన్​ సమయంలో శ్రామిక్​ ప్రత్యేక రైళ్ల ద్వారా ప్రయాణించిన వలస కార్మికులలో మొత్తం 97మంది మృతి చెందినట్లు పార్లమెంట్​ తెలిపింది. ఈ మేరకు ఓ రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చింది కేంద్రం.

97 people died on-board Shramik Special Trains: Center admits in Parliament
శ్రామిక్​ ప్రత్యేక రైళ్ల ప్రయాణికుల్లో 97మంది కూలీలు మృతి
author img

By

Published : Sep 19, 2020, 4:30 PM IST

దేశవ్యాప్త లాక్​డౌన్​ సమయంలో వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన శ్రామిక్​ రైళ్ల ద్వారా ప్రయాణించిన వారిలో మొత్తం 97మంది కూలీలు మరణించినట్లు కేంద్రం​ వెల్లడించింది. పార్లమెంటు​ సమావేశాల్లో భాగంగా.. రాజ్యసభలో తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ సెప్టెంబర్​ 9వరకు నమోదైన గణాాంకాలని రాజ్యసభకు స్పష్టం చేశారు మంత్రి పీయూష్​ గోయల్​.

అయితే.. మొత్తం 97 మృతుల్లో.. 87 కేసులను మాత్రమే పోస్టుమార్టం కోసం పంపారని ఈ సందర్భంగా గోయల్​ తెలిపారు. వీటిలో 51 మందికి సంబంధించిన వివరాలు తమవద్దకు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. మరణించిన వారిలో గుండెపోటు, మెదడు సంబంధిత వ్యాధి, మూత్రపిండాల సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులే అధికంగా ఉన్నారని చెప్పారు మంత్రి.

63 లక్షల మందికిపైగా..

లాక్​డౌన్​ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు మే 1 నుంచి శ్రామిక్​ ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది కేంద్రం. ఆగస్టు 31 నాటికి మొత్తం 4,621 రైళ్ల ద్వారా.. సుమారు 63లక్షల 19వేల మంది కార్మికులు ప్రయాణించారు. వీటి ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.433 కోట్ల ఆదాయం పొందింది కేంద్రం.

ఇదీ చదవండి: నాన్నకు సాయంగా కూతురు.. వంద ఇళ్లకు న్యూస్​ పేపర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.