బిహార్‌కు వేర్వేరు రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన 10వేల 385మంది వలస కార్మికుల్లో 560మంది కరోనా వైరస్ బారినపడ్డారు. మే 16 వరకు నమోదైన ఈ గణాంకాల్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఈ 560మందిలో 172మంది దిల్లీ నుంచి వచ్చినట్టు వివరించింది. మరో 123 మంది మహారాష్ట్ర, 26మంది బంగాల్ నుంచి బిహార్‌కు వచ్చినట్టు స్పష్టం చేసింది. మరో 2,746మంది పరీక్షల ఫలితాలు ఇంకా రాలేదని వెల్లడించింది.
రాష్ట్రానికి చేరుకుంటున్న వలస కూలీలను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నట్టు బిహార్ ఆరోగ్యశాఖ పేర్కొంది. నిత్యం అప్రమత్తంగా ఉండి వైరస్ కట్టడికి శ్రమిస్తున్నట్టు తెలిపింది.
ఇదీ చూడండి:- వలస కూలీల ఆగ్రహం- ఉత్తర భారతంలో ఉద్రిక్తత