మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వ్యాపమ్ ప్రవేశ పరీక్ష కుంభకోణంలో 31 మందిని దోషులుగా తేల్చింది భోపాల్ సీబీఐ కోర్టు. తీర్పును నవంబర్ 25కు వాయిదా వేసింది.
మధ్యప్రదేశ్‌లో 1982లో ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం వ్యాయ్సాయిక్ పరీక్ష మండల్ (వ్యాపం)ను ఏర్పాటు చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం హయాంలో రూ.3 వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో చాలా మంది నేతలు, అధికారులపై ఆరోపణలు వచ్చాయి.
కేసు పూర్వాపరాలు..
1982: ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి వ్యాయ్సాయిక్ పరీక్ష మండల్ (వ్యాపం) ఏర్పాటు చేశారు.
2008: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను ఇందులో మిళితం చేశారు.
2009: వైద్య విద్య పరీక్ష పత్రం లీకేజీ- మొదటి ఫిర్యాదు నమోదు
2009 జులై 5: నియామకాల్లో భారీగా అక్రమాలు వెలుగుచూశాయి.
2009 డిసెంబర్: కుంభకోణంపై విచారణ జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేసిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
2013 జులై 7: ఎఫ్ఐఆర్ నమోదు, 20 మంది అరెస్టు
2013 జులై 16: కుంభకోణం ప్రధాన నిందితుడు జగదీశ్ సాగర్ అరెస్టు
2013 ఆగస్టు 26: కేసును ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు అప్పగింత.. 55 ఎఫ్ఐఆర్ల నమోదు
2013 అక్టోబర్ 9: 345 మంది అభ్యర్థుల ప్రవేశాల రద్దు
2013 డిసెంబర్ 18: మాజీ ఉన్నత విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత శర్మపై కేసు నమోదు
2015 జూన్ 29: వివిధ కారణాల వల్ల 23 మందికి కేసుతో సంబంధముందని సిట్ ప్రకటన
2015 జులై 4: నిందితుడైన ఎంబీబీఎస్ విద్యార్థి నమ్రతా దామోర్ తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించిన పాత్రికేయుడు అక్షయ్ సింగ్ మరణం
2015 జులై 5: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ వైద్య కళాశాల డీన్ మరణం
2015 జులై 7: సీబీఐ దర్యాప్తునకు శివరాజ్ సింగ్ చౌహాన్ అంగీకారం
2015 జులై 8: నమ్రతా దామోర్ హత్య కేసును పునర్విచారణకు పోలీసుల నిర్ణయం
2015 జులై 9: వ్యాపం కుంభకోణానికి సంబంధించి అన్ని కేసులను సీబీఐకి బదిలీ చేసిన సుప్రీంకోర్టు
2015 జులై 11: కుంభకోణానికి సంబంధించి చౌహాన్ వద్ద సమాచారం ఉందని సమాచార హక్కు పత్రాల ద్వారా వెల్లడి
2015 జులై 13: 40 మందితో సీబీఐ దర్యాప్తు బృందం ఏర్పాటు
2015 జులై 16: 150 మందిపై కేసులు నమోదు చేసిన సీబీఐ
2015 జులై 17: సీబీఐ ఎఫ్ఐఆర్లో నమోదైన పార్టీనేతను సస్పెండ్ చేసిన భాజపా
2015 జులై 20: ఛార్జిషీట్లు దాఖలు చేసేందుకు సిట్‌కు సుప్రీం అనుమతి
2015 జులై 29: 18 మంది నిందితులపై సీబీఐ కేసు నమోదు
2015 ఆగస్టు 11: జగదీశ్ సాగర్ ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఈడీ
2015 ఆగస్టు 22: 1,200 మందిపై 7 కేసులు నమోదు చేసిన సీబీఐ
2015 ఆగస్టు 25: 212 కేసుల్లో చర్యలు తీసుకునేందుకు సీబీఐకి 3 వారాల గడువు ఇచ్చిన సుప్రీం
2015 సెప్టెంబర్ 18: డాక్టర్ రాయ్, ఆయన భార్య బదిలీను ఉపసంహరించుకున్న ప్రభుత్వం
2016 సెప్టెంబర్ 7: డాక్టర్ రాయ్ ఆరోపణలపై స్పందించేందుకు సుప్రీం నిరాకరణ
2016 నవంబర్ 22: ఎంపీ మాజీ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ మరణం
2017 ఫిబ్రవరి 13: ఎంబీబీఎస్ కోర్సుల్లో 634 మంది విద్యార్థుల ప్రవేశాన్ని రద్దు చేసిన సుప్రీం
2017 నవంబర్ 26: సుమారు 200 అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలన్న సీబీఐ
2017 డిసెంబర్ 21: 491 మంది నిందితులకు వారి ఛార్జిషీట్ డీవీడీలను అందించిన సీబీఐ
2018 జనవరి 16: 95 మందిపై కొత్త ఛార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ
2018 ఫిబ్రవరి 8: లక్ష్మీకాంత శర్మపై కేసు నమోదు
2018 మార్చి 22: జేఎన్ చౌక్సీని అరెస్టు చేసిన సీబీఐ
2018 సెప్టెంబర్ 27: దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియాకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశం
2019 జులై 28: వ్యాపంలో చాలా అక్రమాలు జరిగినట్లు నివేదిక వెల్లడి
2019 నవంబర్ 21: 31 మందిని దోషులుగా నిర్ధరణ..
2019 నవంబర్ 25: తీర్పు