ETV Bharat / bharat

టిక్​టాక్​ కోసం పిల్లికి ఉరి- కిరాతకుడు అరెస్ట్​ - cat hang for tiktok in tamilnadu

లైకుల మైకంలో పడి.. పిల్లికి ఉరివేశాడు. వీడియో వైరల్​ కావాలని మూగజీవాన్ని చిత్రవధ చేశాడు. అనుకున్నట్టుగానే వీడియో బాగా వైరల్​ అయ్యింది. తమిళనాడు పోలీసులూ అతడి 'కిరాతక ప్రతిభ'ను గుర్తించి, అరెస్టు చేశారు.

18-year-old arrested for posting hanged cat for TikTok video
టిక్​టాక్​ కోసం.. పిల్లికి ఉరివేసి చంపిన హంతకుడు అరెస్ట్​!
author img

By

Published : May 23, 2020, 3:39 PM IST

తమిళనాడులో పిల్లికి ఉరివేసి చంపిన ఓ యువకుడిని అరెస్ట్​ చేశారు పోలీసులు.

టిక్​టాక్​ కోసం.. పిల్లికి ఉరివేసి చంపిన హంతకుడు అరెస్ట్​!

సత్యంపురానికి చెందిన తంగరాజ్.. టిక్​టాక్​లో లైకులు రావాలంటే ఏదైనా వెరైటీగా చేయాలనుకున్నాడు. బాగా ఆలోచించి 'పైశాచిక ప్రయత్నం' చేశాడు. పిల్లి మెడకు తాడు బిగించి, సీలింగ్​కు వేలాడదీసి.. వడివేలు కామెడీ డైలాగ్​ను జత చేశాడు. ఆ డైలాగులోని హాస్యాన్ని ఆస్వాదిస్తూ.. మూగజీవిపై రాక్షసత్వం చూపిస్తూ.. ఆ పిల్లి ప్రాణం తీశాడు.

మే 16న పోస్ట్​ చేసిన ఈ వీడియోపై జంతుప్రేమికుడు, సామాజిక కార్యకర్త భాగ్యరాజ్ మే 19న​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జీవహింసకు పాల్పడ్డందుకు తంగరాజ్​పై సెక్షన్​ 429, 11, 11(i) కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం తంగరాజ్​ బెయిల్​పై బయట ఉన్నాడు.

ఇదీ చదవండి:డబ్బు కోసం వైద్య విద్యార్థినులకు గాలం.. చివరికి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.