ETV Bharat / bharat

మహారాష్ట్రలో కొత్తగా 134 కరోనా కేసులు - maharashtra corona case

మహారాష్ట్రలో కరోనా ప్రభావం అంతకంతకూ ఎక్కువవుతోంది. ఇవాళ మరో 134 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వీటిలో ముంబయిలోనే 113 కేసులు నమోదయ్యాయి.

134 new COVID-19 cases in Maha
మహారాష్ట్రలో కరోనా విజృంభణ
author img

By

Published : Apr 12, 2020, 2:26 PM IST

దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. వైరస్​ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. నేడు మరో 134 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ముంబయిలో 113, రాయ్​ఘడ్​, అమ్రావతి, భీవండి, పింప్రి-చింద్వారాలో ఒక్కోకేసు, పుణెలో నాలుగు, మిరా భయాందర్​లో 7, నావి ముంబయి, థానె, వాసాయ్​ విరార్​లో రెండు చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1895కు చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

పుణెలో ఈరోజు మరణించిన ఇద్దరికీ కరోనా పాజిటివ్​గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరికీ ఇతర ఆరోగ్య సమస్యలున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 127కు చేరింది.

ఇదీ చదవండి: లాక్​డౌన్​ పాస్​ అడిగినందుకు పోలీస్ చెయ్యి నరికివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.