ETV Bharat / bharat

ఉపఎన్నిక తేదీ ఖరారు- ఈసీ కీలక ప్రకటన - mamata banerjee election advisor

EC ELECTION
బంగాల్ ఎన్నికలు
author img

By

Published : Sep 4, 2021, 1:17 PM IST

Updated : Sep 4, 2021, 2:42 PM IST

13:15 September 04

ఉపఎన్నిక తేదీ ఖరారు- ఈసీ కీలక ప్రకటన

బంగాల్​లోని భవానీపుర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక(bhawanipur bypoll) ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 30న ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎలక్షన్ కమిషన్(EC bypolls news) నిర్ణయించింది.

బంగాల్​లోని జంగీపుర్, సంసీర్​గంజ్ నియోజకవర్గాలతో(jangipur election) పాటు ఒడిశాలోని పిల్పి స్థానానికీ ఇదే తేదీన ఉప ఎన్నిక జరపనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 3న కౌంటింగ్ ఉంటుందని స్పష్టం చేసింది.

దీదీకి కీలకం

ఈ ఉపఎన్నిక తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీకి కీలకం కానుంది. సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మమత.. ఇందులో గెలిస్తేనే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రిగా పనిచేసే వారు ఆ పదవి చేపట్టిన ఆరు నెలల్లోగా అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంటుంది. భవానీపుర్ స్థానం నుంచే దీదీ పోటీ(mamata banerjee election seat) చేసే అవకాశాలు ఉన్నాయి. 

బంగాల్​కు ప్రత్యేకం!

పాలనాపరమైన అవసరాలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా.. బంగాల్​ అసెంబ్లీలో ఖాళీలను వెంటనే భర్తీ(bengal by election) చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది. వివిధ రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంట్ స్థానాలకు ఇప్పుడే ఎన్నికలు నిర్వహించకున్నప్పటికీ.. బంగాల్ ప్రభుత్వ ప్రత్యేక అభ్యర్థన కారణంగా ఈ ఉపఎన్నికలు(bengal by polls) చేపడుతున్నట్లు వెల్లడించింది.

Last Updated : Sep 4, 2021, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.