ETV Bharat / bharat

రూ.300 కోసం దారుణం.. తమ్ముడిని చంపిన అన్న.. మంచినీళ్ల​ ట్యాంక్​లో శరీర భాగాలు.. - madhya pradesh murder case

రూ.300 కోసం ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన వివాదం ఒకరి ప్రాణం తీసింది. మద్యం మత్తులో ఉన్న అన్న.. తమ్ముడిని చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో వెలుగుచూసింది. మరో ఘటనలో ఓ యువకుడు తనను ప్రేమించలేదన్న కోపంతో ఓ మైనర్​ను హత్య చేశాడు.

a man killed his brother
మధ్యప్రదేశ్​లో తమ్ముడిని చంపిన అన్న
author img

By

Published : Dec 16, 2022, 9:17 PM IST

Updated : Dec 16, 2022, 9:29 PM IST

మధ్యప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగుచూసింది. రూ.300 కోసం ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. కోపంతో అన్న.. తమ్ముడిపై దాడి చేశాడు. దీంతో అతడు ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేతుల్​ జిల్లాలో ఇద్దరు సోదరుల మధ్య రూ.300 కోసం వివాదం చెలరేగింది. రమేశ్​ కకోడియా అనే వ్యక్తి తన తమ్ముడు సుమన్​ సింగ్​ కకోడియా భార్య వద్ద రూ. 300 అప్పుగా తీసుకున్నాడు. ఈ డబ్బుల విషయంలో ఇద్దరు సోదరులు మధ్య గొడవ జరిగింది. అయితే కోపంలో ఉన్న రమేశ్​.. సుమన్​ తలపై పైపుతో గట్టిగా కొట్టాడు. దీంతో సుమన్​కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన సుమన్​ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. గొడవ జరిగిన సమయంలో సోదరులిద్దరూ మద్యం మత్తులో ఉన్నారని మరో వ్యక్తి తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

మైనర్​ను హత్య చేసిన యువకుడు
రాజస్థాన్​లోని​ జాలోర్​లో దారుణం జరిగింది. ఓ యువకుడు తనను ప్రేమించడం లేదన్న కారణంతో.. ఓ మైనర్​ను హత్య చేశాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. ఆహోర్​ ప్రాంతానికి చెందిన హజారిలాల్​ హరిజన్​ అనే 22 ఏళ్ల యువకుడు అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి వెంట ప్రేమ పేరుతో తిరిగేవాడు. కానీ, ఆ అమ్మాయి అతడిని పట్టించుకోలేదు. దీంతో అమ్మాయిపై కోపం పెంచుకున్న హజారిలాల్​.. పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

మంచి నీటిశుద్ధి కర్మాగారంలో శరీర భాగాలు..
గుజరాత్​లోని​ అహ్మదాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోటర్​పుర్​ ప్రాంతంలో ఉన్న మంచినీటి శుద్ధి కర్మాగారంలో ఉన్న వ్యాటర్​ ట్యాంక్​లో కొన్ని శరీర భాగాలు కనిపించాయి. శుక్రవారం ఉదయం అహ్మదాబాద్​ ఎయిర్​పోర్ట్​ పరిసరప్రాంతాలకు మంచినీటిని అందించడానికి ముందు ఓ ఉద్యోగికి.. వాటర్​ ట్యాంక్​లో తేలియాడుతూ కాళ్లు, చేతులు, తల భాగాలు కనిపించాయి. వెంటనే అతడు ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. వెంటనే వారు నగరానికి చేరే నీటి​ సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పోలీసులు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న.. ఆ శరీర భాగాలను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికు తరలించారు. మున్సిపల్​ సిబ్బంది వెంటనే ఆ ట్యాంక్​లో ఉన్న 1.5 కోట్ల లీటర్ల నీటిని నర్మదా నదిలో విడిచిపెట్టారు. మెడికల్​ రిపోర్ట్​ వచ్చిన తర్వాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

టాయిలెట్​కు వెళ్లి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో హత్య
ముంబయిలో దారుణం జరిగింది. బస్టాండ్​ ఎదురుగా పబ్లిక్‌ టాయిలెట్​ను ఉపయోగించి డబ్బులు ఇవ్వలేదనే విషయంలో జరిగిన గొడవలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాహుల్ పవార్ అనే వ్యక్తి బస్టాండ్​ ఎదురుగా ఉన్న పబ్లిక్‌ బాత్​రూమ్​ను ఉపయోగించాడు. అతడు డబ్బులు చెల్లించకుండా వెళ్లిపోతుండగా అక్కడ పనిచేసే విశ్వజీత్ అనే కేర్​టేకర్​ అడ్డుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంతో విశ్వజీత్.. రాహుల్​పై కత్తితో దాడి చేశాడు. అనంతరం రాడ్డుతో తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువకుల్ని బంధించిన పెళ్లి బృందం
సెల్​ఫోన్​ దొంగతనానికి పాల్పడ్డారనే అనుమానంతో ఓ పెళ్లి బృందం కొంత మంది యువకులని గొలుసులతో బంధించారు. కోల్డ్​ స్టోరేజ్​లో ఏకంగా 12 గంటలపాటు ఉంచి నరకం అంటే ఎంటో చూపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి వెళ్లి యువకులను రక్షించారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. కమల్‌గంజ్‌లోని ఓ ఫంక్షన్​హాల్​లో శుక్రవారం వివాహం జరిగింది. అక్కడ ఫరూఖాబాద్‌, కమల్‌గంజ్‌కు చెందిన కొంతమంది యువకులు వైయిటర్లుగా చేరారు. పెళ్లికి వచ్చిన నితీశ్​, మహేశ్వరి అనే దంపతుల మొబైల్​ఫోన్ చోరీకి గురైంది. ఆ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో అక్కడ పనిచేస్తున్న వెయిటర్లపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం కార్యక్రమానికి వచ్చిన గెస్ట్ హౌస్ యజమానితో కలిసి నితీశ్​, మహేశ్వరి రాత్రి 12 గంటల సమయంలో ఐదుగురు వెయిటర్లను పట్టుకున్నారు. అనంతరం కోల్డ్ స్టోరేజ్​కి తీసుకొచ్చి కాళ్లు, చేతులను గొలుసులు బిగించి తీవ్రంగా కొట్టారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడం వల్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు కూడా వీళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Last Updated : Dec 16, 2022, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.