ETV Bharat / bharat

టీచర్​ను పెళ్లాడిన స్టూడెంట్​.. తల్లిదండ్రులకే వార్నింగ్​! - bihar girl married teacher

బిహార్​లో ఓ యువతి టీచర్​ను ప్రేమించి పెళ్లిచేసుకొంది. దీంతో యువతి కుటుంబ సభ్యుల నుంచి వారికి బెదిరింపులు ఎదురయ్యాయి. అయితే ఆ యువతి కుటుంబ సభ్యులను ఉద్దేశిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం అది వైరల్​గా మారింది.

Bettiah viral video
కోచింగ్​ టీచర్​ను పెళ్లి చేసుకొన్న యువతి
author img

By

Published : Dec 20, 2022, 12:44 PM IST

Updated : Dec 20, 2022, 1:01 PM IST

బిహార్​లో టీచర్​ను ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఓ యువతి కన్నవారిని ఎదురిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. తన భర్తకు ఎలాంటి హానీ జరిగినా.. వారిని కోర్టుకు లాగుతానని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో స్థానికంగా వైరల్​గా మారింది.

వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం..
పశ్చిమ చంపారన్​ జిల్లాలోని బేతియాకు చెందిన అంజలి కుమారి అనే 21 ఏళ్ల యువతి.. అదే ప్రాంతంలో ఓ కోచింగ్​ సెంటర్​ నిర్వహించే చందన్​ కుమార్​ అనే 27 ఏళ్ల టీచర్​ను ప్రేమించింది. నాలుగేళ్ల క్రితం అంజలీ ఇంటర్​ పూర్తి చేసిన తర్వాత ఆ కోచింగ్​ సెంటర్​లో చేరింది. ఆ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలోనే డిసెంబర్​ 12న అంజలి ఇంటి నుంచి పారిపోయి.. బేతియా ప్రాంతానికి చేరుకొంది. వెంటనే ప్రియుడుకి ఫోన్​ చేసి అక్కడికి రమ్మని చెప్పింది. అయితే చందన్​ కుమార్​ అంజలినీ ఇంటికి వెళ్లాలని కోరాడు. కానీ అంజలి దానికి నిరాకరించి.. వెంటనే రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. భయపడిన చందన్​ హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు. అదే రోజు వారిద్దరూ వివాహం చేసుకొన్నట్లు తెలిపింది.

" పెళ్లి విషయం మా కుటుంబసభ్యులకు తెలిసింది. అప్పటి నుంచి మా నాన్న.. నా భర్తను కాల్చివేస్తానని బెదిరిస్తున్నారు. అతడి కుటుంబసభ్యులపై కూడా యాసిడ్ దాడి చేస్తానన్నారు. వారికి ఏదైనా జరిగితే నేను వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. వారిని హైకోర్టుకే కాదు.. సుప్రీంకోర్టుకు కూడా లాగుతాను. అనవసరంగా నా భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులపైన తప్పుడు కేసులు పెడుతున్నారు. వారు పెట్టే తప్పుడు కేసులను పోలీసులు స్వీకరించవద్దు."అని అంజలి ఈ వీడియోలో కోరింది.

Last Updated : Dec 20, 2022, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.