ETV Bharat / bharat

కాలేజ్​లో యువతి దారుణ హత్య.. అక్కడికక్కడే మృతి.. ప్రేమే కారణం! - girl stabbed to death in karnataka

బెంగళూరులోని ఓ కాలేజ్​లో దారుణ ఘటన వెలుగుచూసింది. యువతిపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం అతడు కూడా కత్తితో పొడుచుకున్నాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

A Girl Stabbed to death in a Bengaluru college

author img

By

Published : Jan 2, 2023, 4:08 PM IST

Updated : Jan 2, 2023, 6:53 PM IST

Bangalore Girl Death: కర్ణాటకలోని బెంగళూరులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. యళహంకలోని ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుతున్న ఓ యువతిపై మరో కాలేజ్​కు చెందిన మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం అతడు కూడా కత్తితో పొడుచుకున్నాడు. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోలార్​ ప్రాంతానికి చెందిన బాధితురాలు.. ప్రెసిడెన్సీ కళాశాలలో ఎంటెక్ చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం బాధితురాలిపై మరో కాలేజీలో చదువుతున్న పవన్ ​కల్యాణ్​ అనే యువకుడు.. కత్తితో దాడి చేశాడు. అనంతరం అతడు కూడా పొడుచుకున్నాడు. విషయం తెలుసుకున్న కళాశాల సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే యువతి మృతి చెందింది.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. పవన్​ను స్థానిక ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలిని ఇటీవలే పవన్​ ప్రపోజ్​ చేయగా.. ఆమె నిరాకరించిందని సమాచారం. అందుకే పవన్​ కత్తితో దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది.

Last Updated : Jan 2, 2023, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.