ETV Bharat / bharat

Barmer daughter: కట్నం డబ్బులు.. గర్ల్స్ హాస్టల్​ నిర్మాణానికి విరాళం - Barmer daughter latest news

Barmer daughter: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు రూ. 75 లక్షలను బాలికల వసతి గృహ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు ఓ నవ వధువు. ఆమె తీసుకున్న నిర్ణయంతో రాజస్థాన్​లోని బాడ్​మేర్​, జైసేల్మర్ ప్రాంతాల్లో అనేకమంది బాలికలకు విద్యాభ్యాసం సులభతరం కానుంది.

Barmer daughter
బాడ్​మేడ్​​ వధువు
author img

By

Published : Nov 27, 2021, 7:53 AM IST

Barmer daughter: రాజస్థాన్​లోని బాడ్​మేడ్​​ జిల్లాలో ఓ నవ వధువు.. వరకట్నం కింద తన తండ్రి ఇచ్చిన రూ. 75లక్షలను బాలికల వసతి గృహ నిర్మాణం కోసం విరాళంగా అందజేయడం ద్వారా ఆదర్శంగా నిలిచారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా బాడ్​మేర్​, జైసేల్మర్ ప్రాంతాల్లో అనేకమంది బాలికలకు విద్యాభ్యాసం సులభతరం కానుంది.

barmer
అంజలి, ప్రవీణ్​ సింగ్ దంపతులు

బాడ్​మేర్ జిల్లాకు చెందిన యువతి అంజలికి ప్రవీణ్ సింగ్​ అనే వ్యక్తితో ఈ నెల 21న వివాహమైంది. కట్నం కింద చెక్కు కావాలని ఆమె తన తండ్రిని ముందే అడిగారు. ఆయన అనుమతితో రూ. 75 లక్షలు చెక్కు రాసి బాడ్​మేర్​లో వసతి గృహానికి అందించారు.

తండ్రి పోత్సాహంతో..

తాను ఇంటర్ పూర్తిచేయగానే తన కుటుంబసభ్యులు పై చదువులు వద్దొన్నారని.. తన తండ్రి ప్రోత్సాహంతోనే ప్రస్తుతం దిల్లీలో ఎల్​ఎల్​బీ చేస్తున్నానని అంజలి తెలిపారు. ఇప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాల్లో బాలికలకు బాలురతో సమానంగా విద్య లభించటం లేదన్నారు.

తమ కుమార్తె తీసుకున్న నిర్ణయం.. తమకెంతో సంతోషాన్నిచ్చిందని అంజలి తండ్రి కెప్టెన్ హీర్​ సింగ్ తెలిపారు.

ఇదీ చూడండి: 'మేము మద్యం ముట్టము'.. ప్రజలతో కలిసి సీఎం ప్రమాణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.