Tiger Attack Mother Son : మహిళ అద్భుత తెగువ చూపించి పులి పంజా నుంచి తన పదిహేను నెలల కుమారుడిని కాపాడుకుంది. ఆ సమయంలో గాయలపాలైై ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఉమరియా జిల్లాలోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో జరిగింది.
ఇదీ జరిగింది.. రోహ్నియా గ్రామానికి చెందిన భోలా ప్రసాద్, అర్చన దంపతులకు 15 నెలల కుమారుడు ఉన్నాడు. ఆదివారం ఉదయం కాలకృత్యాలకై కుమారుడు రవిరాజును పొలానికి తీసుకెళ్లింది అర్చన. ఇంతలో అక్కడికి వచ్చిన పులి.. వారిపై దాడి చేసింది. బాలుడిని నోట్లో కరచుకుని వెళ్లబోయింది. చిన్నారిని కాపాడే సమయంలో పులి అర్చననూ గాయపరిచింది. అర్చన అవేవీ లెక్కచేయకుండా గట్టిగా అరుస్తూ పులిని అడ్డుకుంది.
![Bandhavgarh Tiger Reserve](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16281779_umaria.jpg)
అర్చన కేకలు విని కొంత మంది గ్రామస్థులు అక్కడికి చేరుకుని పులిని చెదరగొట్టారు. దీంతో పులి అడవిలోకి పారిపోయింది. గాయపడిన తల్లీ, కుమారుడిని వెంటనే మన్పుర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి ఉమరియా జిల్లా ఆస్పత్రికి తరలించారని ఫారెస్ట్ గార్డ్ రామ్ సింగ్ మార్కొ తెలిపారు.
![Tiger Attack Mother Son](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16291372_tiger.jpg)
ఇవీ చదవండి: మళ్లీ బతికొస్తాడని ఉప్పులో మృతదేహం.. కొన్ని గంటల తర్వాత