ETV Bharat / bharat

నాలుగు కాళ్లు, నాలుగు చేతులు, పెద్ద తల.. అరుదైన శిశువు జననం.. కాసేపటికే.. - baby born with four hands and legs in bihar

బిహార్​లో ఓ మహిళ ఓ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. సాధారణ శిశువులకంటే పెద్ద తలతో పుట్టిన ఆ చిన్నారికి నాలుగు కాళ్లు, నాలుగు చేతులు ఉన్నాయి. ఈ శిశువును చూసేందుకు గ్రామస్థులు ఆస్పత్రి వద్ద గుమిగూడారు.

baby born with four hands and four legs in bihar
baby
author img

By

Published : Dec 22, 2022, 1:58 PM IST

బిహార్​లోని పుర్ణియా మహిళ ఓ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టిన ఆ చిన్నారిని చూసేందుకు స్థానికులు ఆస్పత్రి వద్ద గుమిగూడారు. సాధారణ చిన్నారుల కంటే పెద్ద తలతో ఉన్న ఆ చిన్నారి పుట్టిన కొన్ని గంటలకే మరణించింది. అయితే ఇలాంటి శిశువులు అరుదుగా పుడుతారని వైద్యులు తెలిపారు.

అసలేం జరిగిందంటే : పుర్ణియాలోని బైసా బ్లాక్‌లో డిసెంబర్ 18న మౌజావారికి చెందిన ఓ మహిళ ఓ అరుదైన శిశువుకు జన్మనిచ్చింది. నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టిన ఆ చిన్నారి తల మాత్రం సాధారణ శిశువుల కంటే రెండు రెట్లు పెద్దదిగా ఉంది. మరోవైపు ఆ చిన్నారికి కొన్ని అవయవాలు రెండుకు బదులు ఒకటే ఉన్నాయి. కళ్లు, ముక్కు లాంటి అవయవాలు సైతం పెద్దవిగా ఉన్నాయి. ఈ శిశువు గురించి తెలుసుకున్న స్థానికులు తనను చూసేందుకు ఆస్పతికి తరలివచ్చారు. పుట్టిన కాసేపటికే ఆ చిన్నారి మృతి చెందింది. పోషకాహార లోపం లేదా ఇతర కారణాల వల్ల ఇటువంటి పిల్లలు పుడుతారని వైద్యులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.