ETV Bharat / bharat

అహింసతో ఆంగ్లేయులకు చుక్కలు.. ఆ ఊరంతా సత్యాగ్రహులే!

author img

By

Published : Jun 5, 2022, 7:25 AM IST

Azadi Ka Amrith Mahotsav: వారెన్నడూ గాంధీని చూడలేదు. కనీసం గొంతూ వినలేదు. కానీ ఆయన మాటంటే వేదంగా భావించి.. ఊరు ఊరంతా సత్యాగ్రహులయ్యారు. అహింసతో ఆంగ్లేయులకు చుక్కలు చూపించారు. ఎంతగా అంటే.. ఆ ఊరు పేరు చెబితే చాలు.. బ్రిటిష్‌ పోలీసులు.. 'అమ్మో బద్మాష్‌ ఊరది' అని భయపడేంతగా! అదే.. పనిమారా గ్రామం!

AZADI KA AMRIT MAHOTSAV
AZADI KA AMRIT MAHOTSAV

Azadi Ka Amrith Mahotsav: గాంధీ బాటను నిబద్ధతతో పాటించి సత్యాగ్రహ, అహింసా తీర్థంగా పేరొందిన పనిమారా.. ఒడిశా బార్గా జిల్లాలోని ఓ మారుమూల ఊరు. 100 వ్యవసాయ కుటుంబాలున్న గ్రామం. అయినా ఊరులోని ప్రతి ఇల్లూ.. స్వాతంత్య్ర సమరంలో దూకింది. కేవలం ఆంగ్లేయులపైనే కాకుండా అంటరానితనం నిర్మూలనపైనా పోరాడింది. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో జరిగిన ఓ సంఘటన ఈ ఊరి పట్టుదలకు నిదర్శనం. క్విట్‌ ఇండియా ఉద్యమం గురించి పనిమారా వాసులకు ఆలస్యంగా తెలిసింది. వెంటనే.. 42 మంది యువకులతో ఓ దళాన్ని ఏర్పాటు చేశారు. వీరంతా ఇల్లూ, వాకిలీ, ఆస్తులు.. కుటుంబాలను వదిలేసి ఉద్యమమే ఊపిరిగా సాగాలనేది తీర్మానం. ఊరంతా వీరికి సహకరించాలి.

క్విట్‌ ఇండియా అంటే చాలు.. ఉక్కుపాదం మోపిన ఆంగ్లేయ పోలీసులు.. వీరిలో తొలి బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమకారులెవ్వరూ తమ పేర్లు చెప్పలేదు. ఏం చేయాలో అర్థంగాని పోలీసులు.. మెజిస్ట్రేట్‌ వద్దకు తీసుకెళ్లారు. కానీ అరెస్టు వారెంట్‌పై సంతకం చేయటానికి ఆయన నిరాకరించారు. కారణం.. వారెంటులో అరెస్టు చేస్తున్నవారి పేర్లే లేవు! ఎంత ఒత్తిడి చేసినా, కొట్టినా ఎవ్వరూ తమ పేర్లుచెప్పలేదు. దీంతో పోలీసులు సంబల్‌పుర్‌ కలెక్టర్‌ వద్దకు వెళ్లి విషయం చెప్పారు. ఆయన.. 'ఏ పేరూ లేకుంటే.. ఏ, బీ, సీ.. అంటూ రాసేయండి' అని సలహా ఇచ్చాడు. పోలీసులు అదే విధంగా చేసి.. వారిని జైలుకు తీసుకెళ్లారు. తీరా అక్కడ జైలర్‌ ఈ ఏ, బీ, సీ పేర్లను చూసి వీరిని తీసుకోవటానికి నిరాకరించాడు. పోలీసులకు, జైలర్‌కు మధ్య వాగ్యుద్ధం సాగింది.

'వీళ్లలో ఎవడైనా పారిపోతే.. ఏమని రాయాలి? ఏ, బీ, సీ పారిపోయాడని రాయాలా? నేనేమైనా పిచ్చివాడిలా కనిపిస్తున్నానా’ అంటూ జైలర్‌ ససేమిరా అన్నాడు. కోర్టులో హాజరు పరచినప్పుడూ.. ఏ హాజిర్‌ హో.. బీ హాజిర్‌ హో.. అంటూ అరుస్తుంటే అంతా నవ్వులే నవ్వులు! మొత్తానికి.. వీరందరికీ ఆరునెలల శిక్ష విధించి జైలుకు పంపించారు. మామూలుగానైతే వీరిని రాజకీయ ఖైదీలున్న చోటికి పంపించాలి. కానీ పేర్లు చెప్పకుండా సతాయించారనే కోపంతో.. కరడుగట్టిన నేరగాళ్లున్న చోట పెట్టారు.

అక్కడితో వదిలేయకుండా బ్రిటిష్‌ పోలీసులు ఊరిమీదికొచ్చారు. ఈ బృందానికి సారథ్యం వహిస్తున్న చమరు పరీడా ఇంటికి వెళ్లి తల్లిని కలిశారు. రూ.30 జరిమానా కట్టకుంటే మీ అబ్బాయికి మరింత కఠినమైన శిక్ష పడుతుందని బెదిరించారు. వెంటనే చమరు తల్లి.. "అతను నా కొడుకు కాదు. ఈ ఊరి బిడ్డ. నాకంటే ఈ ఊరంటేనే ఎక్కువ ప్రేమ. అయినా.. ఈ ఊర్లోని పిల్లలంతా నా బిడ్డలే. జైల్లో ఉన్న అందరికీ నేను జరిమానా కట్టాలా? మీరేమైనా చేసుకోండి" అని తడుముకోకుండా సమాధానమిచ్చింది. దీంతో బిత్తరపోయిన పోలీసులు.. కనీసం ఇంట్లోని కొడవలి ఇవ్వు.. మీ ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్లు రికార్డుల్లో రాసుకుంటాం అంటే.. కొడవలి లేదంటూ.. మీరు తొందరగా వెళ్లిపోతే.. ఇల్లు శుభ్రం చేసుకుంటా అంటూ గోమూత్రం బయటకు తీసింది.

జైల్లో నేరగాళ్ల మనసు మార్చారు
జైల్లో.. కరడుగట్టిన నేరగాళ్ల మధ్య వేసినా.. పనిమారా కుర్రాళ్లు బెదరలేదు. సరికదా.. ఆంగ్లేయులకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టారు. ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనటానికి ఆంగ్లేయ సర్కారు.. జైళ్లలోని ఖైదీలను కూడా వాడుకునేది. నేరగాళ్లకు ఆ దిశగా ఎరవేసేది. యుద్ధబరిలో దిగటానికి సిద్ధపడితే.. కరడుగట్టిన నేరగాళ్లకు తలా రూ.100తో పాటు వారి కుటుంబానికి రూ.500 ఇస్తామని, యుద్ధానంతరం విడుదల చేస్తామని ఆశ చూపింది. పనిమారా ఖైదీలున్న జైలులో కూడా ఇదే ప్రచారం సాగింది. రూ.600 అంటే మాటలు కాదు. కాబట్టి చాలా మంది నేరగాళ్లు విదేశాలకు వెళ్లి యుద్ధం చేయటానికి సిద్ధమయ్యారు. ఈ దశలో పనిమారా సత్యాగ్రహులు. వారి బుర్రల్ని మార్చేశారు. ‘‘రూ.ఐదారు వందల కోసం మరణానికి సిద్ధపడతారా? యుద్ధం అంటే చావటం ఖాయం. మీ ప్రాణాలంటే ఆంగ్లేయులకు లెక్క లేదు. వారి కోసం మీరెందుకు బలవుతారు?.." అంటూ నేరగాళ్లకు ఉద్బోధ చేశారు. దీంతో అప్పటిదాకా సరేనన్న వారు యుద్ధానికి వెళ్లబోమని చెప్పేశారు. ఆశ్చర్యపోయిన జైలు వార్డెన్‌ ఏం జరిగిందో తెలుసుకొని తలపట్టుకున్నాడు. మరుసటి రోజే.. చమరు పరీడా బృందాన్ని.. రాజకీయ ఖైదీలున్న జైలుకు మార్చేసి.. శిక్షను కూడా తగ్గించేశారు.

ఇదీ చదవండి: 'ఛాయ్'​ కోసం ఉరితీశారు.. ఆ అసూయతోనే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.