ETV Bharat / bharat

Ayodhya Ram Mandir Modi : 'అయోధ్యకు ఆహ్వానం అందింది.. రాముడి విగ్రహ ప్రతిష్ఠ చూడడం నా అదృష్టం'

Ayodhya Ram Mandir Modi : అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరుకావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్థ్​ క్షేత్ర ట్రస్ట్​ సభ్యులు.. బుధవారం మోదీని ఆహ్వానించారు.

Ayodhya Ram Mandir Modi
Ayodhya Ram Mandir Modi
author img

By PTI

Published : Oct 26, 2023, 6:54 AM IST

Updated : Oct 26, 2023, 7:04 AM IST

Ayodhya Ram Mandir Modi : ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీరామ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వానించింది. బుధవారం.. మోదీ నివాసానికి వెళ్లిన ట్రస్ట్​ సభ్యులు.. వచ్చే ఏడాది జనవరి 22న జరగనున్న ప్రతిష్టాపన కార్యక్రమానికి మోదీని ఆహ్వానించారు. ఈ విషయాన్ని మోదీ.. ఎక్స్​(ట్విట్టర్​)వేదికగా తెలిపారు.

'గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా'
Ayodhya Ram Mandir Inauguration Date : "ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు. శ్రీరామ మందిర ప్రారంభం నేపథ్యంలో అయోధ్యకు రావాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. దీన్ని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా. నా జీవితకాలంలో ఈ చరిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టం" అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. మరోవైపు, వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ వెల్లడించారు.

  • जय सियाराम!

    आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है।

    मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn

    — Narendra Modi (@narendramodi) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Ayodhya Ram Mandir Tunnel : అయోధ్య రామయ్య భక్తుల కోసం పటిష్ఠ ఏర్పాట్లు.. ఆలయంలో సొరంగం నిర్మాణం

'అన్ని ఆలయాల్లో కార్యక్రమాలు..'
Ayodhya Ram Mandir Opening Date : వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్ భగవత్.. ఓ కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

బాలుడి రూపంలో రామచంద్రుడు..
Ayodhya Ram Statue : రామ మందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించే శ్రీరాముడి విగ్రహం పనులు 90 శాతం పూర్తయ్యాయి. రాముడి విగ్రహం అక్టోబర్ 30 నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని ప్రముఖ శిల్పి విపిన్ భదౌరియా తెలిపారు. ఆ తేదీ నాటికి విగ్రహాన్ని ట్రస్ట్ సభ్యులు వీక్షించేందుకు సిద్ధం చేస్తామని చెప్పారు. బాల రాముడి రూపంలో విగ్రహం ఉంటుందని వివరించారు. మొత్తంగా మూడు రాముడి విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. వేర్వేరు శిల్పులు వీటిని చెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు విగ్రహాల్లో అత్యంత సుందరంగా కనిపించే దాన్ని ఎంపిక చేసి రామ మందిరం గర్భ గుడిలో ప్రతిష్ఠాపన చేస్తారు. రాముడి విగ్రహం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని విపిన్ భదౌరియా చెబుతున్నారు.

Shri Ram Pillar Ayodhya : 290 ప్రదేశాల్లో శ్రీరాముని స్తూపాలు.. అయోధ్యకు చేరుకున్న మొదటిది.. వెయ్యేళ్లు చెక్కుచెదరట!

Last Updated : Oct 26, 2023, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.