ETV Bharat / bharat

భార్యకు ముద్దుపెట్టాడని భర్తను కొట్టారు.. కారణమేంటి? - Uttar Pradesh news

భార్యకు ముద్దుపెట్టాడని ఓ భర్తను అసభ్య పదజాలంతో తిడుతూ చేయి చేసుకున్నారు కొందరు వ్యక్తులు. ఈ సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అయెధ్యలో జరిగింది.

ayodhya-kissing-wife
భార్యకు ముద్దుపెట్టాడని భర్తను కొట్టారు
author img

By

Published : Jun 23, 2022, 5:44 AM IST

Updated : Jun 23, 2022, 10:54 AM IST

భార్య ముందే భర్తను చితకొట్టిన యాత్రికులు

నదిలో స్నానం చేస్తుండగా భార్యకు ముద్దుపెట్టాడని ఓ వ్యక్తిని అక్కడున్న వారు అసభ్య పదజాలంతో తిట్టడంతో పాటు కొట్టారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యస్థలం, శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇదీ జరిగింది: అయోధ్యలో ప్రవహించే పవిత్ర సరయూనదిలో ఓ జంట స్నానం చేయడానికి అందులో దిగింది. ఈ క్రమంలో భర్త తన భార్యకు ముద్దుపెట్టాడు. దీంతో నదిలో పక్కనే స్నానం చేస్తున్న పలువురు అతడిని నది నుంచి పక్కకు లాగి తిట్టారు. అసభ్య పదజాలం వాడుతూ చేయిచేసుకున్నారు. అయోధ్యలో ఇలాంటి పనులు చేయడాన్ని సహించం అని ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తి అన్నాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చూడండి: 106 ఏళ్ల సూపర్ బామ్మ.. బీపీ,షుగర్ లేదు.. హుషారుగా ఇంటి పనులు

600 మొబైల్​ ​టవర్లు చోరీ.. తీగ లాగితే కదిలిన డొంక.. సంస్థ ఉద్యోగి పనేనా?

Last Updated : Jun 23, 2022, 10:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.