ETV Bharat / bharat

22లక్షల దీపాల వెలుగులో అయోధ్య- ఉజ్జయిని రికార్డు బ్రేక్​, గిన్నిస్​లో చోటు - అయోధ్యలో దీపోత్సవ్​

Ayodhya Deepotsav 2023 : 22లక్షలకుపైగా దీపాల వెలుగులో శ్రీరామ జన్మభూమి అయోధ్య ధగధగలాడింది. సరయూ నదీ తీరంలో లక్షలాది దివ్వెలతో అంగరంగ వైభవంగా దీపోత్సవ్‌ జరిగింది. 22లక్షలకుపైగా దీపాలు వెలిగించి గిన్నిస్ బుక్ రికార్డ్స్​లో స్థానం సంపాదించింది ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం.

Ayodhya Deepotsav 2023
Ayodhya Deepotsav 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 7:34 PM IST

Updated : Nov 11, 2023, 9:35 PM IST

Ayodhya Deepotsav 2023 : దివ్వెల పండుగ దీపావళి వేళ.. అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. సరయూ నదీ తీరంలో 51 ఘాట్లలో వెలిగించిన దాదాపు 22.23 లక్షల దీపాల వెలుగులో ధగధగలాడింది. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో జరిగిన ఏడో దీపోత్సవం.. గిన్నిస్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించింది.

ఈ కార్యక్రమాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మహాహారతి ఇచ్చి ప్రారంభించారు. గత తొమ్మిదేళ్లలో దేశంలో ప్రధాని మోదీ స్థాపించిన 'రామరాజ్యం' పునాదిని అయోధ్య మందిర నిర్మాణం బలపరుస్తుందని యోగి ఆదిత్యనాథ్​ తెలిపారు. ఈ దీపోత్సవం ద్వారా ఉజ్జయిని పేరిట ఉన్న 18లక్షల 82వేల దీపాల రికార్డ్‌ను బ్రేక్‌ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మరింత ప్రత్యేకత..
Deepotsav In Ayodhya 2023 : అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న వేళ.. ఈ ఏడాది ఈ దీపోత్సవ్‌ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. 50 దేశాలకు చెందిన రాయబారులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీపోత్సవ్‌కు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీపోత్సవం అనంతరం ప్రత్యేక లేజర్‌ షో ఏర్పాటు చేశారు. దీపోత్సవ కార్యక్రమం నేపథ్యంలో అయోధ్య నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

24 లక్షల దీపాల వెలుగులో అయోధ్య

బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..
Ayodhya Deepotsav History : 2017లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా అయోధ్యలో ఈ దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. తొలి ఏడాది 51వేల దివ్వెలను వెలిగించగా.. ఆ తర్వాత 2018లో దాదాపు 3లక్షల దీపాలను వెలిగించారు. ఆ ఏడాది దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్‌ జంగ్‌ సూక్‌ ముఖ్య అతిథిగా హాజరై.. ఆ వేడుకను వీక్షించారు.

గిన్నిస్​ రికార్డులే రికార్డులు..
Deepotsav Ayodhya Guinness World Record : ఇక, 2019లో 4.10లక్షలు, 2020లో దాదాపు 6లక్షలు, 2021లో 9లక్షలకు పైగా దీపాలను వెలిగించి యూపీ ప్రభుత్వం గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకుంది. గతేడాది ఆ రికార్డును తిరగరాస్తూ 15లక్షల దీపాలను వెలిగించి మరోసారి గిన్నిస్‌ రికార్డును దక్కించుకుంది. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ కూడా హాజరయ్యారు.

  • #WATCH | Ayodhya, UP: CM Yogi Adityanath says, "The construction of lord Ram's temple (Ram Temple) strengthens the foundation of 'Ram Rajya', which was established in India by Prime Minister Modi in the last 9.5 years." pic.twitter.com/dM1XjR69K5

    — ANI UP/Uttarakhand (@ANINewsUP) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయోధ్య రామాలయ గోపురం, తలుపులకు స్వర్ణ తాపడం- మోదీ 100 మీటర్ల నడక, ప్రాణప్రతిష్ఠకు అలాంటి వారు రావద్దన్న ట్రస్ట్​!

గ్రౌండ్​ ఫ్లోర్​లో బాల 'రాముడు'- అయోధ్యలో శబరికి ప్రత్యేక ఆలయం, దర్శనానికి కోటి మంది భక్తులు!

15 వేల మంది బస చేసేలా అయోధ్యలో టెంట్ సిటీ, మూడు పూటలా ఆహారం, భాష సమస్య లేకుండా ఏర్పాట్లు!

Last Updated : Nov 11, 2023, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.