ETV Bharat / bharat

బైక్​ను ఢీకొన్న ఆటో.. ఒకటిన్నర కిలోమీటర్ ఈడ్చుకుంటూ.. బంధువులే కామాంధులై..

బిహార్​లోని సహర్సా జిల్లాలో ఓ అమానవీయ ఘటన వెలుగుచూసింది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొట్టడమే గాక సుమారు 2 కిలోమీటర్ల వరకు అలాగే లాక్కెళ్లాడు ఓ ఆటో డ్రైవర్. దీంతో క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు.. దేశ రాజధాని దిల్లీలో రెస్టారెంట్​కు వెళ్లిన ఇద్దరు స్నేహితులను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ స్నేహితుడు చనిపోగా మరో వ్యక్తి కాలు విరిగింది. అలాగే సొంత మేనమామ బంధువే మైనర్​ బాలికను స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. ఈ ఘటన రాజస్థాన్​లో బయటపడింది. ప్రేమను నిరాకరించిందని కాలేజీ విద్యార్థిని హత్య చేశాడు ఓ దుండగుడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.

Bihar Karnataka Rajasthan Delhi Crime News
క్రైమ్​ వార్తలు
author img

By

Published : Jan 18, 2023, 10:38 PM IST

Updated : Jan 18, 2023, 10:56 PM IST

దిల్లీలోని కంఝవాలా ఘటన తరహాలో మరో కేసు వెలుగులోకి వచ్చింది. బైక్​ నడుపుతున్న ఓ వ్యక్తిని ఆటో డ్రైవర్​ ఢీకొట్టి ఒక్కటిన్నర కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ రోడ్డు ప్రమాదంలో.. కదులుతున్న ఆటో టైర్​లో యువకుడి కాలు ఇరుక్కుపోయింది. బిహార్​లోని సహర్సా జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం..
గాయపడిన వ్యక్తిని 25 ఏళ్ల కోమల్​ కుమార్​గా గుర్తించారు పోలీసులు. మంగళవారం రాత్రి కోమల్​ తన మోటార్​ సైకిల్​పై ప్రయాణిస్తున్న సమయంలో అదే రోడ్డులో వెళ్తున్న ఓ ఆటో అతడి బైక్​ను ఢీకొట్టి ఒకట్టిన్నర కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కోమల్​ కాలు ఆటో టైర్​లో ఇరుక్కుపోయిందని చెప్పారు. ఇది గమనించిన ఆటో డ్రైవర్​ వాహనాన్ని ఆపకుండా అలాగే ఒకటిన్నర కీలోమీటరు వరకు లాక్కెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో వదిలి పారిపోయాడని తెలిపారు. ఈ క్రమంలో కోమల్​ తీవ్రంగా గాయపడ్డాడు.

ఇది గమనించిన స్థానికులు కోమల్​ను దగ్గర్లో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, ఇతడు​ ముంగేర్​ జిల్లా నుంచి తన స్వగ్రామమైన హేంపుర్​కు తన తాత దహనసంస్కారాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్​ను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. 'కోమల్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. తీవ్రమైన రక్తస్రావం జరిగింది' అని కోమల్ మామ చెప్పారు. ప్రమాదంలో కాలు ఆటో చక్రంలో ఇరుక్కుపోయినందున అవసరమైతే కాలు తొలిగిస్తేగానీ అతడి ప్రాణాలను కాపాడలేమని వైద్యులు తెలిపారని కోమల్ మామ చెప్పారు. ప్రస్తుతం, అతడు సర్దార్​ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డ్​లో మృత్యువుతో పోరాడుతున్నాడని ఆయన అన్నారు.

ఇద్దరు స్నేహితుల్లో ఒకరు మృతి..
దిల్లీలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి అష్రఫ్ నవాజ్ ఖాన్(30), అంకుర్ శుక్లా(29) ఇద్దరు స్నేహితులు కలిసి భోజనం కోసం ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అటు నుంచి వస్తున్న ఓ కారు వారిద్దరినీ ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కాగా చికిత్స పొందుతున్న నవాజ్​ ఖాన్​ బుధవారం మృతి చెందగా అంకుర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో అంకుర్​ శుక్లా కాలు విరిగింది. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. అంకుర్​ను మెరుగైన చికిత్స కోసం మ్యాక్స్ ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. కాగా ఇద్దరూ దిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో పీహెచ్​డీ చదువుతున్నారు. ప్రమాదానికి కారణమైన కారును ఘటనా స్థలానికి కొంతదూరంలో గుర్తించామని.. కారు డ్రైవర్​ను త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.

బంధువులే కామాంధులై..
రాజస్థాన్​లోని ధోల్పూర్ జిల్లాలో కామాంధులు రెచ్చిపోయారు. చదువు కోసమని సొంత మేనమామ ఇంట్లో తన మైనర్​ కుమార్తెను ఉంచాడు ఓ తండ్రి. మేనమామ బావమరిది అతడి స్నేహితులు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన రాజస్థాన్​లోని కౌలారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. మైనర్‌ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన తర్వాత సామూహిక అత్యాచారం చేశారు నిందితులు. అంతేగాక ఈ అశ్లీల దృశ్యాలను వారి కెమెరాల్లో చిత్రీకరించి అమ్మాయిని బ్లాక్​మెయిల్​ చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు బాలిక మేనమామ బావమరిదితో పాటు అతడి స్నేహితులపై కేసు నమోదు చేశారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అలాగే మొత్తం కేసును సీఓ సంపౌ విజయ్ సింగ్ విచారిస్తున్నట్లు స్టేషన్‌ ఇన్‌చార్జి వీరేంద్ర మీనా తెలిపారు.

కాలేజీ విద్యార్థిని హత్య..
కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంకలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించిందని డిగ్రీ చదువుతున్న 19 ఏళ్ల రాశి అనే యువతిని కత్తితో పొడిచి హత్య చేశాడు ఓ వ్యక్తి. నిందితుడిని ఆంధ్రప్రదేశ్​కు చెందిన మధుచంద్ర(32)గా గుర్తించారు పోలీసులు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడు వాడిన కత్తి, బ్లూటూత్ సాయంతో నిందితుడి​ని అరెస్టు చేశామని తెలిపారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు చెప్పారు. మృతురాలు శానభోగనహళ్లి గ్రామానికి చెందిన రాశి(19)గా గుర్తించారు పోలీసులు. ఈమె బీఏ డిగ్రీ చదువుతోంది.

కాగా, హత్యకు గురైన యువతి నిరుపేద కుటుంబానికి చెందినది. కుటుంబ పోషణ కోసం తల్లి సుశీలమ్మతో కలిసి దిబ్బూరు సమీపంలోని జామ పండ్ల తోటలో పనికి వెళ్లేది. ఈ సమయంలో అదే తోటలో జామ పండ్లను వాహనంలో తరలించేందుకు వచ్చే మధుచంద్ర అనే ఆటోడ్రైవర్​తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే మధుచంద్రకు ఇదివరకే పెళ్లయి ఓ పాప కూడా ఉందని రాశికి తెలిసింది. దీంతో ఆమె మధుచంద్రను ప్రేమను నిరాకరించింది. ఈ నేపథ్యంలో కోపం పెంచుకున్న మధుచంద్ర.. మంగళవారం రాశిని ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. కత్తిపోట్లకు గురైనప్పటికీ రాశి తన అమ్మమ్మ కోసం కేకలు వేసుకుంటూ 200 మీటర్ల దూరం వరకు నడిచి వచ్చి కుప్పకూలి చనిపోయిందని పోలీసులు చెప్పారు. కాగా, నెల రోజుల క్రితమే మధుచంద్ర రాశి ఇంటికి వెళ్లి పెళ్లికి ఒప్పుకోవాలని లేదంటే చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం.

Last Updated : Jan 18, 2023, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.