ETV Bharat / bharat

యాచకుల మధ్య గ్యాంగ్​వార్.. రాళ్లు, ఇటుకలతో దాడి.. మహిళ మృతి - Stones and bricks attack on beggars in Jharkhand

ముగ్గురు భిక్షాటకులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఝార్ఖండ్​లో ఈ ఘటన జరిగింది.

attack-on-three-beggars-with-stones-and-bricks-in-jharkhand
ఝార్ఖండ్​లో భిక్షాటకులపై రాళ్లు ఇటుకలతో దాడి
author img

By

Published : Jan 25, 2023, 6:47 PM IST

ఝార్ఖండ్​లో ముగ్గురు యాచకులపై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు వీరిని తీవ్రంగా కొట్టారు. ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు విషమస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాంచీలోని కంటతోని బ​స్టాండ్​లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లలిత దేవి, బబ్లు రామ్​, గురురామ్.. కంటతోలి బ​స్టాండ్​ సమీపంలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. లలిత, బబ్లు రామ్​ భార్య భర్తలు. మంగళవారం రాత్రి బస్టాండ్​ లోపలున్న వీరిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాళ్లు ఇటుకలతో తీవ్రంగా కొట్టారు. అనంతరం వారు చనిపోయారని భావించి అక్కడి నుంచి పారిపోయారు.

ఘటనలో లలిత దేవి అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. "ఘటనపై మాకు సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్నాం. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించాం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నాం. మద్యం మత్తులో నిందితులు దాడి చేశారని తెలుస్తోంది. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నిందితుల కోసం వెతుకుతున్నాం. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమోరాలను పరిశీలిస్తున్నాం" అని పోలీసులు తెలిపారు. అయితే, గ్యాంగ్​వార్​లో భాగంగానే ఈ దాడి జరిగిందని సమాచారం.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.