ETV Bharat / bharat

లొంగిపోనున్న అతీక్​ అహ్మద్​ భార్య.. ఆ ఘటనల ఎఫెక్ట్?.. పోలీసులు అలర్ట్ - అష్రఫ్​ అహ్మద్​ భార్య జైనాబ్ ఫాతిమా వార్తలు

గ్యాంగ్​స్టర్​, రాజకీయ నేత అతీక్​ అహ్మద్​ భార్య, అష్రఫ్​ అహ్మద్​ భార్య ఇద్దరూ స్థానిక పోలీస్​ స్టేషన్లలో లొంగిపోనున్నారనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో అతీక్, అష్రఫ్​లు హత్యకు గురయిన ఆయా పరిసర ప్రాంతాలతో పాటు కోర్టులో భద్రతను పెంచింది యోగి ప్రభుత్వం.

atiq ahmeds wife shaista parveen may surrender to up police
పోలీసులు లేదా కోర్టు ముందు లొంగిపోనున్న అతీక్​ భార్య షైస్తా పర్వీన్
author img

By

Published : Apr 16, 2023, 5:21 PM IST

Updated : Apr 16, 2023, 7:10 PM IST

పరారీలో ఉన్న గ్యాంగ్​స్టర్​, రాజకీయ నేత అతీక్​ అహ్మద్​ భార్య షైస్తా పర్వీన్​, అష్రఫ్​ అహ్మద్​ భార్య జైనాబ్ ఫాతిమాలు పోలీసులకు లొంగిపోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఘటన జరిగిన పరిసర ప్రాంతాలతో పాటు కోర్టు ఆవరణలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అంతేకాకుండా ఇంటెలిజెన్స్​ విభాగాన్ని కూడా అప్రమత్తం చేసింది ప్రభుత్వం. అతీక్​పై కాల్పుల నేపథ్యంలో ప్రతి వ్యక్తిపై నిఘా ఉంచారు పోలీసులు. ధూమన్‌గంజ్, ఖుల్దాబాద్, పురముఫ్తిలోని ఏదో ఓ పోలీస్ స్టేషన్​లో షైస్తా లొంగిపోనున్నట్లు సమాాచారం. ఎన్​కౌంటర్​లో కుమారుడు మృతి చెందడం, భర్తలు దుండగుల కాల్పుల్లో చనిపోయిన నేపథ్యంలో షైస్తా, జైనాబ్ లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది!

అతీక్​ అహ్మద్​తో పాటు షైస్తా పర్వీన్​ కూడా ఉమేశ్​ పాల్​ హత్య కేసులో నిందితురాలిగా ఉంది. ఇప్పటివరకు ఈమె పరారీలో ఉంది. ఈమెను పట్టిస్తే రూ.50 వేల రివార్డు ఇస్తామని యూపీ పోలీస్​ శాఖ ప్రకటించింది. కాగా, రెండ్రోజుల క్రితమే షైస్తా పర్వీన్ కుమారుడు అసద్​ అహ్మద్​ పోలీసుల ఎన్​కౌంటర్​లో మృతి చెందాడు. కుమారుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పర్వీన్​.. బుర్ఖా ధరించి వచ్చిందని ప్రచారం సాగింది. ఇందుకు సంబంధించి ఫొటోలు కూడా సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ, వాటిని పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.

మరోవైపు ఆదివారం షైస్తా పర్వీన్, అష్రఫ్ భార్య జైనాబ్ ఫాతిమాతో కలిసి మేజిస్ట్రేట్ నరేంద్ర కుమార్ కోర్టులో లొంగిపోవచ్చనే ఇంకో ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసు బలగాలతో పాటు మహిళా పోలీసులను కూడా మోహరించారు. మరోవైపు బుర్ఖా ధరించే మహిళలపై ప్రత్యేక నిఘా ఉంచింది విజిలెన్స్​ బృందం. గ్యాంగ్​స్టర్​, రాజకీయ నేత అతీక్​ అహ్మద్​, అతడి సోదరుడు అష్రఫ్​ అహ్మద్​లను శనివారం అర్ధరాత్రి ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతీక్, అష్రఫ్ చనిపోయారు.

ఏడు లక్షల పిస్టోల్​.. 15 బులెట్ల లోడింగ్​ సామర్థ్యం!
అతీక్​, అష్రఫ్​లపై కాల్పులు జరిపేందుకు దుండగులు వాడిన పిస్టోల్​ గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీని పేరు జిగానా అని.. వీటి విలువ అక్షరాల ఏడు లక్షల వరకు ఉండొచ్చని చెబుతున్నారు అధికారులు. దీనిని ప్రత్యేకంగా తుర్కియే, మలేసియా దేశాల్లోనే తయారు చేస్తారట. అంతేకాకుండా దీంట్లో ఒకేసారి 15 బులెట్లను లోడ్​ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. శనివారం అర్ధరాత్రి మాఫియా డాన్​ అతీక్​, అష్రఫ్​లను చంపేందుకు దుండగులు ఈ పిస్టళ్లనే వాడినట్లుగా గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలో లక్షల విలువైన విదేశీ పిస్టోళ్లను కొనేందుకు నిందితులకు అంత డబ్బు ఎలా వచ్చింది? వీరికి వాహనాలు, ఆశ్రయం ఎవరూ సమకూర్చారనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు పోలీసులు. కాగా, జిగానాగా పిలిచే ఈ పిస్టోళ్ల వాడకాన్ని భారత్​లో నిషేధించారు. కేవలం 35 సెకన్ల వ్యవధిలోనే ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు నాన్​స్టాప్​గా 18 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వీరిద్దరూ చనిపోగా మరో పోలీస్​ అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కాల్పుల కేసులో నిందితులుగా ఉన్న అరుణ్​ మౌర్య(18), మోహిత్ అలియాస్ సన్నీ(23), లవ్లేష్ తివారీ(22) ముగ్గురూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారని తెలిపారు పోలీసులు. కాగా, వీరిని ఆదివారం కోర్టు ముందు హాజరుపరచగా.. 14 రోజుల జ్యూడీషియల్​ కస్టడీని విధించింది న్యాయస్థానం.

జర్నలిస్టులుగా వచ్చారు.. కాల్చి చంపారు..!
మాఫియా డాన్​ అతీక్​ అహ్మద్​, అష్రఫ్​లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ముగ్గురు దుండగులు మీడియా ప్రతినిధులుగా వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా యూపీ రాజధాని లఖ్​నవూ, కాళిదాస్​ మార్గ్​లతో పాటు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతను పెంచారు అధికారులు. కాళిదాస్​ మార్గ్​లో సీఎం, డిప్యూటీ సీఎం సహా ఇతర ముఖ్యమైన మంత్రుల నివాసాలు కూడా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. పైగా లఖ్​నవూ, కాళిదాస్​ మార్గ్​లలో మీడియా ప్రవేశంపై కూడా ఆంక్షలు విధించారు. కాగా, పోలీసుల అదుపులో ఉన్న అతీక్​​, అష్రఫ్​లను వైద్యపరీక్షల కోసం ప్రయాగ్​రాజ్​లోని కొల్విన్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఘటనపై కమిటీ వేసిన సీఎం..
ప్రయాగ్‌రాజ్​ కాల్పుల ఘటన నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ కమిటీని ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరవింద్ కుమార్ త్రిపాఠి నేతృత్వంలో మరో రిటైర్డ్ జడ్జి బ్రిజేష్ కుమార్ సోనీ, మాజీ డీజీపీ సుబేష్ కుమార్ సింగ్ ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ వ్యవహారంపై ప్రతి రెండు గంటలకు ఓ సారి హోంశాఖ సహా డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం. ఈ ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వం నుంచి పూర్తి నివేదకను కోరింది కేంద్ర సర్కార్. ఈ మేరకు కేంద్రానికి రిపోర్ట్​ను అందజేసింది రాష్ట్ర హోంశాఖ. కాగా, ఈ మొత్తం వ్యవహారంపై ఏర్పాటైన కమిషన్​ రెండు నెలల్లో నివేదికను రాష్ట్ర హోంశాఖకు అప్పగించాల్సి ఉంటుంది.

అతీక్​ ఘటనపై స్పందించిన కాంగ్రెస్​..!
గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌, అతని సోదరుడు అష్రాఫ్‌ల హత్య నేపథ్యంలో అధికార భాజపాపై కాంగ్రెస్‌ తీవ్రంగా విరుచుకుపడింది. భాజపా పాలనలో జంగల్‌ రాజ్‌, మాఫియారాజ్‌ కొనసాగుతోందని ఆరోపించింది. నేరస్థులను కచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందేనన్న హస్తం పార్టీ అది చట్టానికి లోబడి ఉండాలని పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం చట్టాన్ని దుర్వినియోగం చేయటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ నేతగా ఎదిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌, మాజీఎంపీ అతీక్‌ అహ్మద్‌, అతని సోదరుడు అష్రాఫ్‌ల హత్య నేపథ్యంలో కాంగ్రెస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగంలో పేర్కొన్న చట్టాలే ప్రధానమని ఏఐసీసీ(AICC) ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అన్నారు. నేరానికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాల్సిందేనని.. అలాంటి వారికి రక్షణ కల్పించిన వారిని కూడా బాధ్యుల్ని చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.

సమాజ్​వాదీ, బీఎస్పీ కౌంటర్​!
గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్‌లు పోలీసు కస్టడీలో హత్యకు గురికావటం వల్ల యూపీ సర్కార్‌ పనితీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి అనుమానం వ్యక్తం చేశారు. అత్యంత తీవ్రమైన, ఆందోళనకరమైన ఈ కాల్పుల ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని రాష్ట్రాన్ని ఎన్‌కౌంటర్ ప్రదేశ్‌గా మార్చారని మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. మట్టిలో కలిపేస్తామన్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలతో పోలీసు కస్టడీలో తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున రక్షణ కల్పించాలని అతీక్‌ అహ్మద్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినా ఫలితం లేకపోయిందని ఎస్పీ సీనియర్‌ నేత రామ్‌ గోపాల్‌ యాదవ్‌ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అతీక్‌ అహ్మద్‌ మిగితా కుమారులను చంపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదని యాదవ్‌ ట్వీట్‌ చేశారు.

పూర్తయిన గ్యాంగ్​స్టర్ల అంత్యక్రియలు..
ఉమేశ్​ పాల్​ హత్య కేసులో మోస్ట్​ వాంటెడ్​గా ఉన్న అతీక్​ అహ్మద్​, అష్రఫ్​ అహ్మద్​లు శనివారం అర్ధరాత్రి దుండగుల చేతుల్లో హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మృతదేహాలకు వారి స్వగ్రామంలోని కసరి మసారి శ్మశాన వాటికలో భారీ పోలీసుల భద్రత నడుమ అంత్యక్రియలు పూర్తిచేశారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో శ్మశానం లోపలికి దగ్గరి బంధువులతో పాటు కొద్ది మంది స్థానికులను మాత్రమే అనుమతించారు.

Last Updated : Apr 16, 2023, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.